చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు అన్యాయం జరిగిందా..?

టాలీవుడ్ సినిమాలైన మహర్షి, జెర్సీ సినిమాలకు నేషనల్ ఫిలిం అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా జెర్సీ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.

 Netizens Comments About Politics Behind Chiranjeevi Balakrishna Movies, Chirenje-TeluguStop.com

ఈ సినిమాలతో పాటు మలయాళ సినిమా అయిన మరక్కార్ సినిమా కూడా నేషనల్ ఫిలిం అవార్డ్ కు ఎంపికైంది.అయితే ఈ సినిమా విడుదల కాకముందే నేషనల్ ఫిలిం అవార్డ్ కు ఎంపిక కావడం గమానార్హం.

అయితే ఈ అవార్డుల విషయంలో చిరంజీవి, బాలకృష్ణ నటించిన పీరియాడికల్ మూవీస్ కు అవార్డులు ఎందుకు రాలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.బాలకృష్ణ నటించి క్రిష్ దర్శకత్వం వహించి 2017లో విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించడానికి అర్హత ఉన్న సినిమానే అయినప్పటికీ ఆ సినిమాకు అవార్డ్ రాలేదు.

దేశ సమైక్యత కొరకు కృషి చేసిన శాతకర్ణి పాత్రకు అవార్డు రాకపోవడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి అంచనాలను మించి సక్సెస్ కావడంతో పాటు నటుడిగా చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు కూడా నేషనల్ ఫిలిం అవార్డ్ రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ రాజకీయ నేతలు కావడంతో వాళ్ల సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆయా హీరోల అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ కోణాల ప్రకారమే అవార్డుల పంపిణీ జరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

Telugu National Awards, Netizens-Movie

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు పీరియాడికల్ చిత్రాల్లో నటిస్తున్నా అవార్డులు ఆయా సినిమాలకు రాకపోవడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కొందరు నెటిజన్లు మాత్రం ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వకపోయినా ప్రజలు పీరియాడికల్ మూవీస్ ను సక్సెస్ చేస్తూ అవార్డులను ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అవార్డుల విషయంలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube