తన భార్య, కూతురు ఫోటో పెట్టగానే...యాంకర్ రవి పై ఎలాంటి కామెంట్స్ చేసారో చూడండి!  

  • టివీలు చూసే వారందరికీ తెలుసు…యాంకర్ లాస్య రవీలు టామ్ అండ్ జెర్రీ టైప్ అని…అసలు మొదట్లో వీరిద్దరూ లవర్స్ అనే పుకార్లు కూడా వచ్చాయి. లాస్య మంజునాథ్ ని పెళ్లి చేసుకొని వాటికి చెక్ పెట్టింది. ఆ సమయంలోనే రవి కి ఇదివరకే పెళ్లి అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి రవి పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. గతంలో తనకు పెళ్లయిందా? లేదా? అన్నది తన పర్సనల్ అంశమని, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా విషయం బయట పెట్టారు. తనకు భార్య, కూతురు ఉన్నారని తెలిపారు. వారి ఫోటోస్ కూడా విడుదల చేశారు.

  • Netizens Comments About Anchor Ravi Shares His Wife And Daughter Pics-Anchor Family Pic Anchor Nitya Saxena

    Netizens Comments About Anchor Ravi Shares His Wife And Daughter Pics

  • తన భార్య పేరు నిత్య సక్సేనా అని, తనకు 3 ఏళ్ల కూతురు కూడా ఉందని రవి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. తన కూతురు పేరు వియా అని తెలిపారు. రవి స్వయంగా ఈ వివరాలు బయట పెట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సక్సెస్‌ఫుల్ మెన్ కంటే ఫ్యామిలీ మెన్… చాలా సంతోషంగా ఉంటాడంటూ ఈ సందర్భంగా రవి చెప్పడం గమనార్హం. రవి ఈ విషయం చెప్పడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.