20 రోజుల్లో కాజల్ పెళ్లి.. ఇప్పుడు ఆస్తుల పంచాయతీ?

సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో వరుసగా నటీనటులు పెళ్లి లు చేసుకోగా….  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా ఇటీవల ప్రకటించింది.

 Kajal Agarwal, Goutham Kichlu, Love Story, Marriage, Assets, Tollywood, Mumbai-TeluguStop.com

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ను ఈ నెల 30వ తేదీన పెళ్లి చేసుకోబోతుంది.కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 14 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే.

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ ను ఎనిమిదేళ్ళ  నుంచి ప్రేమించుకుంటున్నప్పటికీ బయట ఎక్కడ ఈ విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈ అందాల భామ.ఇప్పుడు ఇద్దరి తల్లితండ్రులు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 30న ముంబైలో ఒక స్టార్ హోటల్ లో కుటుంబ సన్నిహితుల సమావేశం మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు.

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తేదీ ఒక ఇంటి కోడలు కానుంది.అయితే కాజల్ పెళ్లి జారబోతుందని ఆమె ప్రకటించడంతో అభిమానులు అయితే మిస్ యు కాజల్ అంటూ కామెంట్లు చెయ్యడం ప్రారంభించారు.

అయితే కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి ప్రకటించగానే వారిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైందని, ముందుగా ప్రపోజ్ ఎవరు చేశారని, పెళ్ళి తరవాత సినిమాలు చేస్తుందా లేదా అని ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్నారు.

ఇక అలాంటి కాజల్ అగర్వాల్ ని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

గౌతమ్ కిచ్లూ, కాజల్ అగర్వాల్ ఆస్తుల విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.కాజల్ ఎంత సంపాదించిందని కొందరు ప్రశ్నించగా ఆమె ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల ఆదాయం ఉంటుందని ఇప్పటి వరకు బాగానే సంపాదించి ఉంటుందని, గౌతమ్ కిచ్లూ ఆస్తులు మొత్తం రూ.50 కోట్లకుపైగా ఉన్నాయని అంచనా వేశారు.అయితే అలా అంచనా వేసిన నెటిజన్లను చూసిన మరికొందరు ఏంటండీ ఈ ఆస్తి గొడవలు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube