బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా...?. అని అడిగిన నెటిజన్... దాంతో ఈ హీరోయిన్...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు సామాన్య ప్రజలకి దూరం బాగా తగ్గిపోయింది. దీంతో సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు లైవ్, చిట్ చాట్ తదితర కార్యక్రమాల ద్వారా తమ అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.

 Netizen Asking To The Telugu Heroine Eesha Rebba About Her Boyfriend, Eesha Rebb-TeluguStop.com

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అటువంటి “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్”  అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి నటిగా పరిచయమైన తెలుగు బ్యూటీ ఇషా రెబ్బ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇషా రెబ్బ ప్రస్తుతం సినిమా షూటింగులు తక్కువగా ఉండటంతో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

దీంతో తాజాగా ఇషా రెబ్బ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఈ క్రమంలో ఓ నెటిజన్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా.? అని అడిగాడు. దీంతో ఇషా రెబ్బ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పుకొచ్చింది.

అలాగే తన తదుపరి చిత్రాల గురించి కూడా మాట్లాడుతూ తాను నటించినటువంటి లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ తొందర్లోనే ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుందని తెలిపింది.అలాగే తనకి బ్యాడ్మింటన్ ఆట అంటే చాలా ఇష్టమని కూడా పేర్కొంది.

Telugu Eesha Rebba, Eesharebba, Lust Storys, Netizentelugu, Telugu, Tollywood-Mo

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇషా రెబ్బ  మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇందులో తెలుగులో అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తమిళంలో “ఆయీరామ్ జన్మంగల్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతేగాక ఇటీవల  ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube