John W. Armstrong : మూత్రంతో కంటి సమస్యలు పోగొట్టుకున్నానని చెబుతున్న మహిళ.. షాకవుతున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు విభిన్న విషయాలపై సలహాలు, ఉపాయాలను పంచుకుంటారు.వీటిలో కొన్ని మంచివి, వాస్తవాలు లేదా అనుభవం ఆధారంగా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చెడ్డవి, అవి ప్రజలను తప్పుదారి పట్టించగలవు లేదా అని కూడా కలిగించగలవు.

 Netizens Are Shocked By The Woman Who Says That She Got Rid Of Her Eye Problems-TeluguStop.com

ఏ సలహాను విశ్వసించాలో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొందరు వ్యక్తులు మంచి చిట్కాలను చెడు సమాచారంతో మిళితం చేస్తారు.తాజాగా సుమా ఫ్రేల్( Suma Fraile ) అనే టిక్‌టాక్ వినియోగదారు, తనను తాను ‘అసిస్టెంట్ మెటాఫిజికల్ కౌన్సెలర్’గా( Assistant Metaphysical Counsellor ) నెటజన్లకు పరిచయం చేసుకుంది.

ఆమె ఆరోగ్య చిట్కా అంటూ మూత్రాన్ని ఐ డ్రాప్స్‌గా ఉపయోగించవచ్చని ఫాలోవర్లకు సూచించింది.ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మూత్రాన్ని కంటి చుక్కలుగా వాడటం వల్ల , కంటి చూపులు మెరుగుపరుచుకోవచ్చని, కంటి సమస్యలను( Eye problems ) నయం చేసుకోవచ్చని అని ఫ్రేల్ ఒక వీడియోలో చెప్పుకొచ్చింది.తన కంటి చూపు మెరుగయ్యే వరకు రోజూ మూత్రం చుక్కలు వేసే దానిని కూడా చెప్పింది.

చాలా కాలం క్రితం జాన్ W.ఆర్మ్‌స్ట్రాంగ్ ( John W.Armstrong )అనే బ్రిటీష్ వ్యక్తి ప్రారంభించిన “యూరిన్ థెరపీ”( Urine Therapy ) అనే ఔషధం నుంచి ఈ పరిష్కారాన్ని కనిపెట్టినట్లు ఆమె నమ్మ బలిసింది.యూరిన్ థెరపీని ఇష్టపడే వ్యక్తులు దీనిని చర్మంపై రుద్దడం, చిగుళ్లపై పెట్టుకోవడం లేదా తాగడం వంటి అనేక విషయాలకు ఉపయోగిస్తారు.

కానీ ఫ్రేల్ ఈ ఆలోచనను కొత్త స్థాయికి తీసుకెళ్ళింది.

ఫ్రేల్ ఒక టిక్‌టాక్ వీడియోలో సాధారణ మందుల కంటే “యూరిన్ డ్రాప్స్” ( Urine Drops )సమర్థవంతంగా పనిచేస్తాయని ఆరోపించింది.క్రమం తప్పకుండా తన కళ్లలో మూత్రం పోసుకున్న తర్వాత కంటి సమస్యలు తొలగిపోయాయని టాకింగ్ కామెంట్స్ చేసింది.సాధారణ మందులు చెడు రసాయనాలేనని, మూత్రం సహజసిద్ధమైన వైద్యం అని చెప్పింది.

ఉత్తమ ఫలితాల కోసం ఉదయం, సాయంత్రం యూరిన్ డ్రాప్స్ వాడాలని సలహా ఇచ్చింది.నిపుణులు ఏమేం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు.

మానవ మూత్రం కంటి చూపును మెరుగుపరుస్తుందని చూపించే రుజువులు లేదా పరిశోధనలు లేవని స్పష్టం చేశారు.ఇలా చేస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందని అందరినీ హెచ్చరించారు.

పిట్స్‌బర్గ్‌లోని ఒక వైద్య కేంద్రం ప్రజలను యూరిన్ థెరపీని ఉపయోగించవద్దని హెచ్చరించింది, ఎందుకంటే మూత్రంలో ఆరోగ్యానికి సహాయపడే తగినంత విటమిన్లు, ఖనిజాలు లేవు.మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ ఒలివియా కిలీన్ కూడా ప్రజలు మూత్రాన్ని కంటి చుక్కలుగా ఉపయోగించకూడదని అన్నారు.దీనివల్ల తీవ్రమైన కంటి సమస్యలు వచ్చి చివరికి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube