రాహుల్ ఫిట్నెస్ టిప్స్ అడుగుతున్న నెటిజన్స్..!?

కండల వీరుడు.రాహుల్ గాంధీ

 Netizens Are Asking Rahul Gandhi Fitness Secrets , Rahul Gandhi, Fitness Center,-TeluguStop.com

కరోనా కారణంగా ప్రపంచ మొత్తం స్తంభించిపోయింది.

అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలయ్యాయి.కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వల్ల చాలా మంది గుణపాఠం నేర్చుకున్నారు.ఆరోగ్యం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.

ఇంట్లోనే ఉంటూ శరీరంపై శరీర ఆకృతిని మార్చుకునేందుకు కుస్తీ పడ్డారు.వీరిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా చేరారు.

రోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు.అన్‌లాక్ ప్రక్రియ తర్వాత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు.

తాజాగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ.రాహుల్ గాంధీ ఎంతో చలాకీగా పాల్గొంటున్నారు.సముద్రంలో ఈత కొట్టడం, పుష్‌అప్స్ చేయడం వంటివి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.దీంతో రాహుల్ దగ్గరి నుంచి కొందరు ఫిట్‌నెస్ టిప్స్ కూడా అడుగుతున్నారు.

ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ.

ఒక్కసారిగా స్థానికంగా ఉన్న సముద్రంలో దూకి ఈత కొట్టారు.అంతటితో ఆగకుండా కొద్దిసేపు వల పట్టుకుని చేపలు పట్టి అందరినీ ఆకట్టుకున్నారు.

అయితే ఈత కొట్టిన అనంతరం తడి బట్టలతో బయటకు వచ్చిన రాహుల్‌ని చూసి అందరూ షాక్‌కి గురయ్యారు.తడి బట్టలతో ఉన్న ఆయన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫోటోలను చూసిన వారంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Telugu Fitness, Fitness Secret, Kerala, Netizens, Rahul Gandhi-Latest News - Tel

సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ కండలపై హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి.ఫిబ్రవరి 25వ తేదీన రాహుల్‌ కేరళలోని కొల్లం జిల్లా పర్యటనలో భాగంగా.తంగసరి బీచ్‌‌కు వెళ్లారు.

ఈతగాళ్లు, మత్స్యకారులతో కలిసి సముద్ర పర్యటనకు వెళ్లిన రాహుల్‌ ఒక్కసారిగా ఆరేబియా సముద్రంలో దూకి కొద్దిసేపు ఈతకొట్టారు.చల్లటి నీటిలో ఈతకొట్టిన అనంతరం పైకి రాగా నీలి రంగు టీషర్ట్‌‌లో రాహుల్‌ కండల వీరుడిగా కనిపించాయి.

దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడమే ఆలస్యం.సోషల్ మీడియాలో నెటిజన్లు రాహుల్‌ రిబ్స్.

సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.బాక్సర్‌ మాదిరిగా కండలు పెంచారని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కొన్ని ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెప్పాలని ట్విటర్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా అడుగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube