ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితులలో చాలా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
దీంతో ఎంతో మంది తమ ఇంటిపెద్దలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు చాలా వరకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది.దీంతో పలువురు ఇటువంటి పరిస్థితులు ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి, సోనూసూద్ లాంటి ప్రముఖులు తమకు తోచినంత సహాయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.తాజాగా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ చేసిన ఈ పని నెట్టింట్లో వైరల్ గా మారింది.
నెటిజన్లు అభిజిత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న పరిస్థితి ఉంది.సిద్దిపేటలోని ఓ కుటుంబం తినడానికి తిండి లేక నిత్యవసర సరుకులు లేని విషయం అభిజిత్ దృష్టికి వచ్చింది.
దీంతో అభిజిత్ తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆరా తీసిన అభిజిత్ ఆ కుటుంబానికి అండగా నిలిచి తన గొప్ప మనసు చాటుకున్నాడు.ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ క్లిష్ట సమయంలో చేసిన సేవలు భేష్ అంటూ బిగ్ బాస్ అభిజిత్ అభిమానులు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.ఈ వీడియోను అభిజిత్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.