నరేంద్రమోదీపై మండిపడుతున్న నెటిజన్లు.. రాజీనామా చేయాలంటూ ట్విట్లు.. ?

దేశానికి ప్రధానిగా మోడీ వచ్చాక దేశప్రజల దశదిశ మారిపోతుందని అంతా భావించారు.కానీ యావత్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతూ కేంద్రం చేస్తున్న పాలన మీద విమర్శలు వెల్లువెత్తుతున్న ఇంకా ఆయన దేశప్రజలకు ఏదో చేస్తారనే ఒక గుడ్డి నమ్మకంతో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.

 Netizens Angry Over Narendra Modi Resign, Pm Modi, Trends No 1, Covid19, Engulfs-TeluguStop.com

ఇలాంటి నేపధ్యంలో కరోనా ప్రజలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది.దీని ఫలితంగా దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి, మరో వైపు నిరుద్యోగ భూతం విలయతాండవం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Telugu Covid, Engulfs, India, Netizens Angry, Pm Modi, Resign, Trends-Latest New

కొవిడ్‌పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.కాగా ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదంటూ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా మృత దేహాలను రహస్యంగా కాల్చి వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల ట్వీట్లు రావడం గమనార్హం.

అదీగాక దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనాను అదుపు చేయడంలో మోదీ దారుణంగా విఫలమయ్యారని, కాబట్టి ఈ నిర్లక్ష్యానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోదీకి ట్విట్టర్‌లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube