పాపం.. తేజస్వి ని బూతులు తిడుతున్నారట… దాంతో…  

netizens abusive comments on Tejaswi madivada Commitment movie, Tejaswi madivada, abusive comments, Commitment, Tollywood, Commitment movie news, Negative trolls, - Telugu Abusive Comments, Commitment, Commitment Movie News, Negative Trolls, Netizens Abusive Comments On Tejaswi Madivada Commitment Movie, Tejaswi Madivada, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు “శ్రీకాంత్ అడ్డాల” దర్శకత్వం వహించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన తెలుగమ్మాయి “తేజస్వి మదివాడ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట్లో అడపాదడప చిత్రాలతో ప్రేక్షకులను అలరించిననా తేజస్వి మదివాడ బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Netizens Abusive Comments On Tejaswi Madivada Commitment Movie

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ తేజస్వి మదివాడ పాల్గొని తాను ప్రస్తుతం నటిస్తున్న “కమిట్ మెంట్” చిత్ర విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే తాను ప్రస్తుతం నటిస్తున్న కమిట్ మెంట్ చిత్రానికి దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నారని తెలిపింది.

TeluguStop.com - పాపం.. తేజస్వి ని బూతులు తిడుతున్నారట… దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాక ఈ చిత్ర కథాంశం గురించి స్పందిస్తూ ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ మరియు కమిట్ మెంట్ సమస్యలు కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉంటాయని ప్రేక్షకులకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేయగా అందులో తాను ఓ బూతు పదాన్ని ఉపయోగించానని కొందరు అసభ్యకరంగా తన గురించి ట్రోల్స్ చేస్తున్నారని వాపోయింది.

అయినప్పటికీ తనకు ఏమీ బాధగా లేదని తన చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేస్తున్నారంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అంతేగాక తాను బిగ్ బాస్ షో లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా కొందరు తనపై నెగిటివ్ ట్రోల్స్ చేశారని మొదట్లో కొంత బాధ అనిపించినప్పటికీ ఆ తరువాత అలవాటు అయిపోయిందని తెలిపింది.ఇక తన పెళ్లి విషయానికి వస్తే బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని దాంతో ఆ మధ్య పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ మళ్లీ కమిట్మెంట్  సినిమాలో నటించే అవకాశం రావడంతో తన పెళ్లిని కొంత కాలం పాటు వాయిదా వేసుకున్నానని చెప్పుకొచ్చింది.

కానీ ఈ క్రమంలో తనకు పెళ్లి మీద పూర్తిగా ఆసక్తి పోయిందని అంతేగాక నటిగా రాణించాలంటే పెళ్లి, పిల్లలు, భర్త, కుటుంభం జీవితంలో అడ్డంకులుగా మారుతారని అందువల్లనే తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

#Commitment #CommitmentMovie #NetizensAbusive #Negative Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Netizens Abusive Comments On Tejaswi Madivada Commitment Movie Related Telugu News,Photos/Pics,Images..