పవన్‌ దర్శకుడిని బుర్ర ఉందా అంటూ ప్రశ్నించిన నెటిజన్‌

హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.ఆయన తన సినిమాల విషయాలను షేర్‌ చేయడంతో పాటు వ్యక్తిగత విషయాలను మరియు కొన్ని సోషల్‌ రెస్పాన్సుబుల్‌ మెసేజ్‌లను కూడా షేర్‌ చేస్తూ ఉంటాడు.

 Director Harish Shankar, Twitter, Yashoda Hospital, Netizen Comment On Harish Sh-TeluguStop.com

హరీష్‌ శంకర్‌ రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఒక పెద్దాయన శ్వాస అందక పోవడంతో ఇబ్బంది పడుతున్నాడని కాపాడాలంటూ ట్విట్టర్‌ ద్వారా హరీష్‌ శంకర్‌ యశోదా హాస్పిటల్‌ను ట్యాగ్‌ చేయడం జరిగింది.ఈ విషయమై వెంటనే స్పందించిన యశోదా ఆసుపత్రి వర్గాల వారు ఆ పెద్దయనను కాపాడటం జరిగింది.

ఇక్కడి వరకు బాగానే ఉంది.అయితే ఇక్కడ ఒక నెటిజన్‌ చేసిన కామెంట్‌ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

పెద్దాయనను కాపాడమంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసి పబ్లిసిటీ స్టంట్‌ చేసే బదులు యశోదా ఆసుపత్రికి ఫోన్‌ చేసి కాపాడమంటూ విజ్ఞప్తి చేస్తే సరిపోతుంది కదా అంటూ సలహా ఇచ్చాడు.బుర్ర లేకుండా హరీష్‌ శంకర్‌ ఉన్నాడు.

కాస్త బుర్ర వాడొచ్చు కదా హరీష్‌ అంటూ ఆ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు హరీష్‌ చాలా సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యాడు.వీడిని ఏమనాలో తెలియడం లేదు ఫ్రెండ్స్‌ అంటూ అతడి కామెంట్‌కు రీ ట్వీట్‌ చేశాడు.

Telugu Harish Shankar, Netizenharish, Publicity, Yashoda-

హరీష్‌ శంకర్‌పై కామెంట్‌ చేసిన వెంకీ అనే ఆ వ్యక్తిపై నెటిజన్స్‌ తెగ ట్రోల్స్‌ చేశారు.సాయం చేసిన వ్యక్తిని బుర్రా ఉందా అంటూ విమర్శించడం నీకే చెల్లింది అంటూ ఎద్దేవ చేశారు.టెక్నికల్‌గా ఫోన్‌ ద్వారా కంటే ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేయడం మంచిదనే విషయం తెలియని నీకు హరీష్‌ శంకర్‌ను ప్రశ్నించే స్థాయి లేదు అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.మొత్తానికి హరీష్‌ శంకర్‌ అభిమానులు వెంకటేష్‌పై దుమ్మెత్తి పోశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube