ఆ వీడియో పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఎందుకు ఇదంటూ నెగటివ్ కామెంట్స్?

ఎందుకో కొందరు అసలు అర్థం కారు.అవతలి వ్యక్తులు ఏం చేసినా కూడా బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.

 Netizen Trolled Heroine Kajal Aggarwal On Her Latest Promotional Video Details,-TeluguStop.com

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను మాత్రం అస్సలు వదలరు.వారు ఏ మంచి పని చేసినా మరో కోణంలో చూస్తూ ట్రోల్స్ చేస్తుంటారు.

అసలు ఏ కోణంలో వీళ్ళు ఆలోచిస్తారో తెలియదు కానీ టార్గెట్ చేస్తే మాత్రం అస్సలు వదలరు.ఇక ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలకు, సామాన్యులకు మధ్య కమ్యూనికేషన్ బాగా దగ్గర్లో ఉంది.

దీంతో వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆడుకుంటున్నారు కొందరు జనాలు.సెలబ్రెటీలు తాము ఏ విషయం పంచుకున్నా కూడా అస్సలు వదలట్లేదు.ఏదో ఒక కామెంట్ చేస్తూ వాళ్లను ఘోరంగా అవమానిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది సామాన్యులు సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేసి చాలా నెగటివ్ కామెంట్లు చేశారు.

అయితే కొందరు వీరి నుంచి వచ్చే కామెంట్లను అస్సలు పట్టించుకోరు.అయితే తాజాగా కాజల్ కూడా ఒక వీడియో పంచుకోగా ఓ నెటిజన్ మరో కోణం లో తనకు నెగటివ్ గా కామెంట్ చేశారు.

ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి హీరోయిన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ చాలా వరకు మంచి మంచి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలో నటించింది కాజల్.

మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ.

మంచి హోదాలో ఉన్న సమయంలో కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడైన బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్టుతో పలు సినిమాల్లో నటించింది.అంతేకాకుండా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాల్లో కూడా అవకాశం అందుకుంది.

కానీ ఆ సమయంలో తను ప్రెగ్నెంట్ కావడంతో ఆ సినిమాను వదులుకుంది.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు తీపి కబురు చెప్పింది.అలా ఆ మధ్యనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.దీంతో కాజల్ ఇక సినిమాలలో నటించేదేమో అని వార్తలు కూడా వచ్చాయి.

కానీ తను మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది.ఆ మధ్యనే తనకు ఓ సినిమాలో అవకాశం కూడా వచ్చినట్లు తెలిసింది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం బాగా పోస్ట్ లు షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా పలు యాడ్స్ లు చేస్తుంది.అయితే తాజాగా ఒక యాడ్ కు సంబంధించిన వీడియో పంచుకుంది.

నిజానికి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఓ నెటిజన్ మాత్రం తప్పుగా అర్ధం చేసుకొని.ఎందుకండి ఈ బతుకు అంటూ నెగటివ్ గా కామెంట్ చేయగా.

వెంటనే కాజల్ అభిమానులు ఆ నెటిజన్ పై ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube