ఇప్పుడు తీసే సినిమాలు బాలేక మళ్లీ నీ పాత సినిమాలు థియేటర్ లో చూస్తున్నాం.. మహేష్ ఫ్యాన్స్ ఆవేదన!

కొన్ని కొన్ని సార్లు నటీనటుల అభిమానులు తమ అభిమానుల నటినటుల విషయంలో నిరాశ పడుతూ ఉంటారు.అది చాలా వరకు సినిమాల విషయంలోనే నిరాశ చెందుతారు.

 Netizen Shocking Comments On Mahesh Babu Movies Details, Mahesh Babu,prince, Vam-TeluguStop.com

తమ అభిమాన హీరోల సినిమాలు ప్లాఫ్ అవుతే అస్సలు తట్టుకోలేరు.దీంతో ఇప్పటికి చాలామంది హీరోల అభిమానులు తమ సినిమాల విషయంలో నిరాశ చెందగా తాజాగా మహేష్ బాబు అభిమానులు కూడా ఆయన సినిమాల విషయంలో బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే.తన లుక్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమాన హీరో గా నిలిచాడు.

ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి బాల నటుడుగా పరిచయమైన మహేష్ బాబు చిన్న వయసులోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.దాదాపు చిన్నవయసులోనే ఎనిమిది సినిమాలకు పైగా నటించాడు.

ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమాలో తన నటనతో ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.

ఆ తర్వాత యువరాజు, వంశీ, మురారి, పోకిరి, అర్జున్ వంటి ఎన్నో సినిమాలు మహేష్ బాబు కు మంచి గుర్తింపును అందించాయి.ఎక్కువగా క్లాస్ సినిమాలకే మంచి ప్రాధాన్యం ఇస్తాడు మహేష్ బాబు.ఇక కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ గా కూడా బాధ్యతలు వహించాడు.మహేష్ బాబు నటుడుగానే కాకుండా వ్యక్తిగతం పట్ల కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇక మహేష్ బాబు తనతో కలిసి నటించిన నటి నమ్రతా శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.నమ్రత మాజీ మిస్ ఇండియా గా కూడా నిలిచింది.

ఈమె ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది.వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

మహేష్ బాబు సినిమా విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

ఇక మహేష్ బాబు ఈమధ్య అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు.గతంలో ఈయన సినిమాలు అన్ని మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాయి.కానీ ఇప్పుడు ఈయన అభిమానులను నిరాశ పరుస్తున్నాడు.దీంతో మహేష్ బాబు అభిమాని ట్విట్టర్ లో తన ఆవేదనని వ్యక్తం చేశాడు.నువ్వు ఇప్పుడు చేస్తున్న సినిమాలు చూడలేకే మళ్లీ పాతవి రిపీట్ చేస్తున్నాము.

ఇప్పటికైనా తెలుసుకో మావయ్య అంటూ మహేష్ బాబును ట్యాగ్ చేసి షేర్ చేశాడు.

ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత సినిమాలు మళ్ళీ థియేటర్లో వేసిన సంగతి తెలిసిందే.మహేష్ బాబు ప్రస్తుతం రెండు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఆ సినిమాలు ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube