అన్నయ్య.. భోళా శంకర్ ఆపేసేయ్యి.. చిరంజీవికి అభిమానులు విజ్ఞప్తి!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Netizen Requests Megastar Chiranjeevi Not To Do Bhola Shankar Movie Details,  Bh-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.కేవలం నటుడుగానే కాకుండా రాజకీయ పరంగా కూడా తన పరిచయాన్ని పెంచుకున్నాడు.

కానీ రాజకీయపరంగా అంతగా ముందుకు సాగలేక పోయాడు.ఇక ఈయన ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.పైగా యంగ్ హీరోలతో పోటీ గా వరస ప్రాజెక్టులతో తన ఖాతా నింపుకుంటున్నాడు.ఇప్పటికే ఆయన ఖాతాలో నాలుగైదు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇక ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

పైగా ఇందులో రామ్ చరణ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.ఎందుకో ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

పైగా చిరంజీవికి, రామ్ చరణ్ కు కూడా ఈ సినిమా బాగా నిరాశపరిచింది.నిజానికి టాలీవుడ్ మెగా స్టార్ హీరో సినిమా కాబట్టి సినిమా విడుదల ముందు బాగానే అంచనాలు వెల్లువెత్తాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Netizen, Rakhi Festival, Tollyw

కానీ ఈ సినిమా విడుదల తరువాత ఎవరూ ఊహించని విధంగా రిజల్ట్ వచ్చింది.నిజానికి ఈ రిజల్ట్ ను మెగా అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.సినిమా విడుదలైన రెండవ రోజు మాత్రం థియేటర్లలో సందడే కనిపించలేదు.నిజానికి చిరంజీవి సినిమా అంటే ఓపెనింగ్స్ ఓ రేంజ్లో అదిరి పోతూ ఉంటాయి.ఈ సినిమా వల్ల ఆయన అభిమానులు బాగా నిరాశ చెందారు.

ఇక చిరంజీవి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

సమాజంలో జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంటాడు.అంతేకాకుండా ఏదైనా పండుగ సందర్భాలలో కూడా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతుంటాడు.

ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Netizen, Rakhi Festival, Tollyw

ఇదిలా ఉంటే రాఖీ పండుగ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ లో.రాఖీ కట్టించుకోవటమే కాదు.రక్షగా నిలుస్తామని ఈరోజు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు మాటివ్వాలి.

నా సోదరసోదరిమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని తెలిపాడు.వెంటనే ఓ నెటిజన్.

అన్నయ్య నిన్ను అన్నయ్యగా భావించే వాళ్ళందరికీ బోళా శంకర్ ఆపేసి రక్షాబంధన్ గిఫ్ట్ గా ఇవ్వచ్చుగా అని కామెంట్ చేశాడు.

ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి బోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈయన ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఈ సినిమా బాగోదు అని.సినిమాల్లో నటించకుండా ఉంటే బాగుంటుంది అని.ఈ సినిమాని వదిలేసి వేరే సినిమాలో నటిస్తే మరింత గుర్తింపు వస్తుంది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.మరి తన అభిమానుల రిక్వెస్ట్ కు చిరంజీవి ఏమని స్పందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube