నాని కత్తి గురించి అప్పుడే ఊహించి చెప్పిన నెటిజన్.. పరువు పోయేలా?

నాని గత సినిమా వి ఓటీటీలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసి ఆ సినిమా హక్కులను ఓటీటీకి ఇచ్చారని కామెంట్లు వినిపించాయి.

 Netizen Comments About Nani First Look Poster Few Months Back , First Look Poste-TeluguStop.com

కథ, కథనంలోని లోపాలు ఆ సినిమాకు మైనస్ గా మారడంతో పాటు థియేటర్లలో ఆ సినిమా విడుదలై ఉంటే రిజల్ట్ మరింత దారుణంగా ఉండేదని డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో నష్టం వచ్చేదని కామెంట్లు వినిపించాయి.

నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీలో విడుదలైంది.

గతేడాది సెప్టెంబర్ నెలలో వి మూవీ రిలీజ్ కాగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో టక్ జగదీష్ మూవీ రిలీజైంది.టక్ జగదీష్ సినిమాలో ఒక సీన్ లో నాని సమస్యను పరిష్కరించడానికి వచ్చి వెనుక వైపు నుంచి వేట కత్తిని తీస్తాడు.

టక్ జగదీష్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలోనే ఒక నెటిజన్ ఆ సీన్ లో నాని ఉల్లిపాయ కట్ చేస్తాడని కామెంట్ చేయగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

టక్ జగదీష్ సినిమా ఎలా ఉంటుందో ముందుగానే ఊహించిన ఆ వ్యక్తి తెలివితేటలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు నానికి ఓటీటీ అచ్చిరావడం లేదనే కామెంట్లు వినిపిస్తోంది.ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న నాని భారీ సక్సెస్ కోసం ప్రస్తుతం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాతోనైనా నాని కోరిక తీరుతుందేమో చూడాల్సి ఉంది.

Telugu Poster, Nani, Rithu Varma-Movie

బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన నాని మూస కథలను ఎంచుకుంటూ కెరీర్ విషయంలో పొరపాట్లు చేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని శ్యామ్ సింగరాయ్ తో పాటు అంటే సుందరానికి సినిమాలో కూడా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube