అతనితో బ్రేకప్.. రవికృష్ణతో రిలేషన్.. నవ్యస్వామిపై నెటిజన్ కామెంట్!

బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం బుల్లితెర ప్రేక్షకులు అందరికి తెలిసిందే.తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమౌతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తోంది.

 Netizen Comments On Navya Swamy Relation With Ravi Krishna, Ravi Krishna, Tv Act-TeluguStop.com

తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.

ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగింపు పలికింది.ఇక ఈ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉంటుంది నవ్య.

గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.కానీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో బాగా పాల్గొంటారు.అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.ఇక తమ సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.పైగా వెంటనే లవ్ సింబల్స్ తో స్పందిస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా నవ్య స్వామి తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా దానికి రవి కృష్ణ లవ్ సింబల్స్ తో స్పందించాడు.దీంతో రవి కృష్ణ ఈవిధంగా స్పందించడంతో నెటి జన్లు వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు మళ్లీ చర్చలు చేసుకుంటున్నారు.ఇక మరో నెటిజన్ గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్ ఉందని, అతనితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణ తో ప్రేమాయణం సాగిస్తుందని కామెంట్ చేయగా ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ కామెంట్ కు నవ్య స్వామి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube