మీతండ్రికి ఒక రూల్? మీకొక రూలా? అంటూ హీరో ని ప్రశ్నించిన నెటిజన్

సోషల్ మీడియా రావడం తో అందరూ కూడా తమ తమ ప్రశ్నలను డైరెక్ట్ గా నటీ నటులతో చాట్ చేసి మరి అడుగుతున్నారు.సోషల్ మీడియా ద్వారానే ఇలాంటివి సాధ్యం అవుతున్నాయి.

 Netijen Questioning Arjun Kapoor Relation With Malaika By Twitter-TeluguStop.com

దీనితో చాలా మంది తమ మనసులో మెదిలే ప్రశ్నలను ఏమాత్రం తడుముకోకుండా నటులను అడిగేస్తున్నారు.సరిగ్గా ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది బాలీవుడు నటుడు అర్జున్ కపూర్ కి.అర్జున్ కు,ప్రముఖ నటి మలైకా అరోరా లు గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.అర్జున్ తో కలిసి ఉండేందుకే మలైకా తన భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుంది అన్న ప్రచారం కూడా జరిగింది.

వారిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయాన్నీ కూడా ఆ ఇద్దరూ పబ్లిక్ గానే ఒప్పుకున్నారు కూడా.అయితే ఈ అంశం పై కుసుమ్ అనే యువతి ట్విట్టర్ వేదికగా అర్జున్ ను సూటిగా ఒక ప్రశ్న సంధించింది.

ఒకప్పుడు మీ నాన్న మీ అమ్మను వదిలేసి శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడంతో మీరు ఆమెను ద్వేషించారు.మరి మీరు మీ ఏజ్‌ కంటే 11 ఏళ్లు పెద్దదైన మహిళతో ఎలా డేటింగ్ చేస్తున్నారంటూ కుసుమ్ ప్రశ్నించింది.

మీతండ్రికి ఒక రూల్? మీకొక రూలా

పైగా ఆమెకు ఓ టీనేజ్ బాయ్ కూడా ఉన్నాడు.అంటే మీ తండ్రికి ఒక రూల్ ? మీకొక రూలా ? అని ప్రశ్నిస్తూ ఒక కామెంట్ పెట్టింది.అయితే అర్జున్ ఏమాత్రం ఊరుకోకుండా వెంటనే ఆమెకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చాడు.నాకు ఎవరిపై ద్వేషభావం లేదు.కాకపోతే.నా తండ్రి రెండో కుటుంబానికి కాస్త దూరంగా ఉండేవాడిని.

మీరన్నట్టు నేను శ్రీదేవిని అసహ్యించుకొని ఉండి ఉంటే గనుక ఆమె కుమార్తెలైన జాన్వి, ఖుషీలను నా చెల్లెల్లుగా స్వీకరించేవాడిని కాదు అంటూ కుసుమ్ కు గట్టిగా సమాధానమిచ్చాడు.అంతేకాకుండా ఈ విధంగా మా మీద కామెంట్ చేయడం చాలా ఈజీ కానీ మాట్లాడే ముందు కాస్త అలోచించి మాట్లాడాల్సి ఉంటుంది అంటూ సలహా కూడా ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube