అక్కడ సైకిల్ తొక్కితే డబ్బులిస్తారు..కిలోమీటర్ కి ఎంత చెల్లిస్తారంటే..  

Netherlands Will Pay You Tax- Rs 16 Per Km For Riding Cycle-riding Cycle,tax- Rs 16 Per Km,నెదర్లాండ్స్,సైకిల్ తొక్కితే డబ్బులిస్తారు

సైకిల్ మన దేశం లో ఇప్పుడు స్కూల్ కి వెళ్లే పిల్లలు లేదా పల్లెటూరులలో ఎక్కడో ముసలి వాళ్ళు తొక్కడం తప్ప పెద్దగా ఎక్కడ మనకు కనిపించవు . ఉద్యోగస్తులు , పెద్దలు సైకిల్ తొక్కడం మానేసి చాలా ఏళ్ళయింది. సైకిల్ తొక్కడం వల్ల మన గమ్య స్థానానికి వెళ్లాడమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం కూడా..

అక్కడ సైకిల్ తొక్కితే డబ్బులిస్తారు..కిలోమీటర్ కి ఎంత చెల్లిస్తారంటే.. -Netherlands Will Pay You Tax-Free Rs 16 Per Km For Riding Cycle

మన దేశం లో ప్రస్తుతం ఎక్కువగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే బైక్ లను , కార్ లను ఉపయోగిస్తున్నాం , అయితే కొన్ని దేశాల్లో మాత్రం అక్కడి ప్రజలు , ఉద్యోగస్తులు ఎక్కువగా సైకిల్ పైనే ప్రయాణించడానికి ఇష్టపడుతారు. దీనికి తగట్టు సైకిల్ తొక్కితే డబ్బులు కూడా ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వాలు చట్టాలు కూడా తీసుకువచ్చాయి.

అదెక్కడో తెలుసుకుందాం

నెదర్లాండ్స్ ప్రపంచం లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ దేశం కూడా ఒక్కటి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతారు. మనం ఆ దేశానికి వెళ్తే అక్కడ మనకి ఎక్కువగా సైకిల్ పైన ప్రయాణిస్తున్న మనుషులే కనిపిస్తారు..

మన దగ్గర రోడ్లపై బస్సుల కోసం బస్‌బే లు ఉన్నట్టు. నెదర్లాండ్స్‌లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేకంగా దారులు ఉంటాయి.

కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం సైకిళ్లనే అనుమతి ఇస్తారు. వేరే వాహనాలకు అనుమతి ఉండదు.విచిత్రమేమిటంటే నెదర్లాండ్స్ ప్రధాని అయిన మార్క్ రుత్తే కూడా తన ఆఫీస్ కి సైకిల్ పైనే వస్తాడు.

అందుకే నెదర్లాండ్స్‌ను నంబర్‌వన్ బైస్కిలింగ్ నేషన్ అని పిలుస్తుంటారు.

సైకిల్ తొక్కితే కిలోమీటర్ కి ఎంత చెల్లిస్తారంటే.

ఆ దేశ ప్రభుత్వం సైకిల్ తొక్కడాన్ని మరింత ప్రోత్సహించే భాగం లో ఒక కొత్త ఆఫర్ పెట్టింది అదేంటి అంటే ఉద్యోగులు ఒక కిలోమీటర్ సైకిల్ తొక్కితే రూ.

16 (0.22 డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం ఆదాయ పన్ను నుంచి మినహాయింపు రూపంలో అందుతుంది. అంటే ఏడాదికి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కితే రూ.1600 మేర ఆదాయపన్ను తగ్గుతుంది.ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లే సమయంలో సైకిల్ ఉపయోగిస్తేనే ఈ వెసులుబాటు కలుగుతుంది..

వ్యక్తిగత అవసరాలకు సైకిల్ తొక్కితే ఇవ్వరు.సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఇతర దేశాల్లోనూ ఉంది. బ్రిటన్‌లో ఆఫీస్‌కు సైకిల్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి.

కంపెనీలు డిస్కౌంట్‌పై సైకిళ్లు, ఇతర వస్తువులను అందిస్తాయి.