నెదర్లాండ్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 12 ఏళ్ల లోపు చిన్నారులను.....

12 ఏళ్ల లోపు చిన్నారులను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది.వారి అమాయకపు ముఖం, వారి అల్లరి చేష్టలు ఏవైనా మనకు ఎంతో సంతోషాన్ని అందిస్తాయి.

 Netherlands Set To Legalise Euthanasia For Kids Under 12 Allowing Parents To Hav-TeluguStop.com

అయితే అలాంటి చిన్నారులు ప్రాణాల మీదకు వస్తే మాత్రం ఎవరూ తట్టుకోలేరు.వారి ప్రాణాలను కాపాడడం కోసం ఎంతటి సాహసాలు అయినా చేస్తాం.

అయితే అలాంటి అనారోగ్యం పాలైన 12 ఏళ్ల లోపు చిన్నారుల విషయం లో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఏ దేశం కూడా సాహసం చేయనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది.ఏ ప్రభుత్వమూ తీసుకురాని చట్టాన్ని డచ్‌ ప్రభుత్వం రూపొందించింది.

డచ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారితీసింది.

ఇంతకీ ఆ కొత్త చట్టం ఏంటంటే.

తీవ్రమైన జబ్బుకు గురై కోలుకునేందుకు అవకాశం లేని ఒకటి నుంచి 12 ఏళ్ల వయసులోని చిన్నారులను నిర్దాక్షిణ్యంగా చంపేయడమే.వినడానికి చాలా అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజంగా నిజం.

నయం చేయడానికి అవకాశం లేని, లేదా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను నిర్ధాక్షిణ్యంగా అంతం చేయడానికి అవకాశం కల్పిస్తూ నెదర్లాండ్స్ ప్రభుత్వం అక్కడి వైద్యులను అనుమతినందించింది.దీనితో ఇక ఇప్పుడు వైద్యులు అటువంటి జబ్బుపడిన పిల్లల జీవితాలను వారు అనుకున్న పద్దతిలో అంతం చేయడానికి వీలుకలుగుతుంది అన్నమాట.

అయితే, దీని కోసం మాత్రం వైద్యులు పిల్లల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం మాత్రం తప్పని సరి.అయితే కొన్ని ఫార్మాస్యూటికల్ సంస్థలు మాత్రం వారికి ఎందుకు అలాంటి మరణం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి.

అయితే చాలా మంది నిపుణులు, చట్టసభ సభ్యులు ఈ కొత్త చట్టానికి మద్దతు పలుకుతున్నారు.వాస్తవానికి, నెదర్లాండ్స్‌లో ఒక సంవత్సరం వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు చనిపోయేందుకు అవకాశం ఉన్నది.

అనారోగ్యంతో ఉన్న పిల్లలకు చనిపోయేందుకు అవకాశం ఇవ్వడానికి చట్టాన్ని పొడిగించాలని డచ్ ఆరోగ్య మంత్రి హ్యూగో డీ జోంగ్ ప్రతిపాదించడం తో ఇప్పుడు తాజాగా ఈ ఏడాది నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube