రానా అరణ్య మూవీ కూడా ఓటీటీ బాటలోనే  

Netflix Rana Aranya - Telugu Bollywood, Kollywood, Lock Down, Netflix Concentrate On Rana Aranya Movie, South Cinema, Tollywood

రానా హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో అరణ్య మూవీ తెరకెక్కింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.

 Netflix Rana Aranya

ఫారెస్ట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా మావటివాడు పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

రిలీజ్ అయ్యే టైంకి లాక్ డౌన్ రావడంతో వాయిదా పడిపోయింది.ఈ సినిమాని చాలా కాలంగా తెరకెక్కించారు.

రానా అరణ్య మూవీ కూడా ఓటీటీ బాటలోనే-Movie-Telugu Tollywood Photo Image

దీనికోసం రానా తన బాడీ షేప్ పూర్తిగా మార్చుకున్నాడు.ఇక సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే రిలీజ్ వాయిదా పడటంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో ఈ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిందట.

సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జాదవ్ పాయెంగ్ అనే లైఫ్ ఆక్టివిస్ట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.ఈ చిత్రం ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెబుతుంది.

ఈ సినిమాకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ నుండి భారీ ఆఫర్ వచ్చిందని టాక్.ఈ ఆఫర్ గురించి సురేష్ బాబు దర్శకుడు ప్రభుకి చెప్పడం జరిగింది.

ఒకవేళ దర్శకుడు ఓకే అనుకుంటే ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో దర్శనమివ్వనుంది.మరి ప్రభు సోలోమన్ ఆలోచన ఎలా ఉంటుందో అనేది చూడాలి.

అయితే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రాలని థియేటర్లో చూస్తేనే మంచి ఫీలింగ్ కలుగుతుంది.మరి ఎన్నో కలలతో తెరకెక్కించిన ఈ సినిమాని దర్శకుడు ఓటీటీ రిలీజ్ చేయడానికి ఇష్టపడతాడా అనేది అనుమానమే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Netflix Concentrate On Rana Aranya Movie Related Telugu News,Photos/Pics,Images..