యావత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఓటిటి ఫ్లాట్ ఫామ్ గా నిలుస్తున్న నెట్ ఫ్లిక్స్ కోట్ల మంది యూజర్లతో ముందుకు దూసుకెళ్తున్నది.అనేక సినిమాలను, వెబ్ సిరీస్ లను డబ్ చేస్తూ.
ప్రాంతీయ భాషలలో కూడా తమ సత్తాను చాటుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఇలాంటి సమయంలో యూజర్లు పెరిగిపోతున్నపుడ్డు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యము యూజర్లకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఇక పాస్వర్డ్ కేవలము కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకునే విధముగా ఒక వెరిఫికేషన్ పెట్టాలని అనుకుంది.
దీనితో ఇకపై సభ్యత్వం తీసుకున్న యూజర్లు తమ పాస్ వర్డ్, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది.అందువల్ల కొత్త అకౌంటు తీసుకోవలసిన అవసరము వస్తుంది.
అప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధిక లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు నెలకు 800 రూపాయలు.
ఇదే మొత్తము ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫై సంవత్సరము కాలవ్యవధిలో 2 అకౌంట్లు తీసుకోవచ్చు.అయితే 800 రూపాయలు నెలకు ఖర్చు పెడుతున్నారు కాబట్టి చాలా మంది వినియోగదారులు తన ఫ్రెండ్స్ తో ఈ అకౌంట్ ని షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు.
అయితే నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగు కష్ట తరము చేసేందుకు నడుము బిగించింది.అయితే ఈ ప్రయత్నము ఇంకా తొలిదశలోనే ఉన్నట్లు తెలుస్తున్నది.
అన్ని డిజిటల్ ప్లాట్ ఫోరమ్స్ తక్కువ ధరకే లభిస్తుండడంతో పైరసీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నది.ఈ పైరసీని అరికట్టే భాగంగా నెట్ ఫ్లిక్స్ కఠినమైన నిబంధనలు పెట్టడము గమనార్హం.నెలకు రూ.800 డబ్బులు కట్టి ఇతరులతో షేర్ చేసుకోవడం కష్టతరంగా ఉంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం కూడా ఉందని కూడా టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.ఏమైనా కానీ ఇది అమల్లోకి వస్తే కానీ ఎటువంటి మార్పు జరుగుతుందో వేచి చూడాలి.