విశ్వక్ సేన్ కి జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసే భామలు, అలాగే సీరియల్స్ లో చేసే నటీమణులకి కి సౌత్ సినిమాలలో హీరోయిన్స్ గా చేసే అవకాశాలు కుప్పలుగా వస్తూ ఉంటాయి.ప్రతి ఏడాది పదుల సంఖ్యలో నార్త్ ఇండియన్ భామలు సౌత్ సినిమాలలో హీరోయిన్స్ గా పరిచయం అవుతూ ఉంటారు.

 Netflix Hot Beauty Mithila Palkar Tollywood Entry-TeluguStop.com

అయితే వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అయ్యి స్టార్ హీరోయిన్స్ అవుతారు.కొంత మంది భామలు కొన్ని సినిమాలకి పరిమితమై తరువాత బ్యాక్ టూ బాలీవుడ్ అంటూ వెళ్ళిపోతారు.

అక్కడ యధావిధిగా సీరియల్స్, సినిమాలలో సెకండ్ హీరోయిన్స్ పాత్రలు చేసుకుంటూ ఉంటారు.ఈ మధ్యకాలంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంకా ఎక్కువ మంది కథానాయికలకి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే అవకాశం దక్కుతుంది.

 Netflix Hot Beauty Mithila Palkar Tollywood Entry-విశ్వక్ సేన్ కి జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి చేరువైన బాలీవుడ్ భామ ఇప్పుడు టాలీవుడ్ లో విశ్వక్ సేన్ కి జోడీగా ఎంట్రీ ఇస్తుంది.

ఈ భామ పేరు మిథిలా పాల్కర్.

హిందీలో పలు టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది.నెట్ ప్లిక్స్ లో ఈ అమ్మడు నటించిన త్రిభంగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ తో మిథిలా బాగా పాపులర్ అయ్యింది.దీంతో త్వరలోనే ఈ అమ్మడు లిటిల్ థింగ్స్ సీజన్ 4 తో నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

మరో వైపు బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది.విశ్వక్ సేన్ హీరోగా తమిళ్ లో హిట్ అయిన ఓ మై కడవులే సినిమాలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా మిథిలా పాల్కర్ ని ఎంపిక చేశారు.ఇప్పటికే ఈ భామ షూటింగ్ లో కూడా పాల్గొంది.

విశ్వక్, మిథిలా కాంబినేషన్ లో సన్నివేశాలని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో తమిళ్ లో విజయ్ సేతుపతి పోషించిన గెస్ట్ అపీరియన్స్ పాత్ర కోసం ఓ సీనియర్ హీరోగా సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

#NetflixHot #OMy #Viswak Sen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు