విరాటపర్వం డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్

దగ్గుబాటి రానా హీరోగా క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్షల్స్ నాయకుడుగా కనిపిస్తున్నాడు.

 Netflix Got Virataparvam Digital Streaming Rights, Tollywood, Rana Daggubati, Sa-TeluguStop.com

ఎప్పుడో దశాబ్దాల క్రితం నక్షల్స్ కథలు టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సృష్టించాయి.తరువాత ఆ తరహా కథలని ఎవరూ టచ్ చేయలేదు.

అయితే మరల ఇప్పుడు రైటర్, దర్శకుడు వేణు ఊడుగుల నక్షల్స్, గిరిజనుల హక్కుల పాయింట్ లో ఎమోషనల్ కథాంశం చెప్పబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన కొన్ని సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి.

ఎమోషనల్ ఎలిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి కూడా ఓ కీలక పాత్రలో నటించింది.ఇక తాజాగా సాయి పల్లవి సోలో సాంగ్ విరాటపర్వం మూవీ నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఆ సాంగ్ మంచి హిట్ అయ్యి సోషల్ మీడియా లో దూసుకుపోతుంది.

Telugu Netflix, Priyamani, Rana Daggubati, Sai Pallavi, Tollywood, Venu Udugula,

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇప్పుడు ప్రముఖ ఒటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.ఒక డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఒటీటీ సంస్థలు పోటీ పడగా నెట్ ఫ్లిక్స్ ఏకంగా 11 కోట్ల రూపాయిలు చెల్లించి రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

క్రేజీ బ్యూటీ సాయి పల్లవికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాగే హీరో రానాకి నార్త్ లో కూడా మంచి మార్కెట్ ఉంది.దీనిని దృష్టిలో ఉంచుకొని నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి 11 కోట్లు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube