సమంతకి భారీ ఆఫర్ తో గాలం వేసిన నెట్ ఫ్లిక్స్

Netflix Gives Huge Offer To Samantha For Web Series, The Family Man2, South Heroines, Kajal Aggarwal, Tamannaah

ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.సమంతా కంటే ముందుగా తమన్నా, కాజల్ అగర్వాల్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన అనుకున్న స్థాయిలో సక్సెస్ ని దక్కించుకోలేదు.

 Netflix Gives Huge Offer To Samantha For Web Series, The Family Man2, South Hero-TeluguStop.com

అయితే సమంత మాత్రం మొదటి వెబ్ సిరీస్ లోనే నటిగా తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో హిట్ దక్కించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంటుంది.ఈ వెబ్ సిరీస్ లో సమంత రియల్ స్టంట్స్ చేసి యాక్షన్ సీక్వెన్స్ లో కూడా తన సత్తా చాటింది.

ఈ నేపధ్యంలో ఇప్పుడు సమంతా కోసం వెబ్ ఛానల్స్ క్యూ కడుతున్నారు.అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకోవడంతో సమంతాతో మరో రెండు వెబ్ సిరీస్ లు విమెన్ సెంట్రిక్ కథలతో తెరకెక్కించదానికి ప్లాన్ చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఈ బ్యూటీతో ఒప్పందం చేసుకోవడానికి రెడీ అయ్యారని టాక్.ఈ వెబ్ సిరీస్ కోసం సమంతకి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.ఇక సౌత్ మార్కెట్ పై దృష్టి పెట్టిన ప్రముఖ ఒటీటీ ఛానల్ నెట్ ఫ్లిక్స్ కూడా ఇప్పుడు సమంత కోసం ప్రయత్నిస్తుంది.ఆమెతో మంచి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తే కచ్చితంగా సౌత్ లో పాగా వేయోచ్చని, అలాగే హిందీలో కూడా క్లిక్ అవ్వొచ్చని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు సౌత్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో సరైన వెబ్ సిరీస్ రాలేదు.ఇప్పుడు సమంతకి రెమ్యునరేషన్ భారీగా ఆఫర్ చేసి ఒప్పందం చేసుకోవడానికి ఛానల్ ప్రయత్నం చేస్తుంది.

మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube