మణిరత్నం పాన్ ఇండియా మూవీకి నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్  

సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి మణిరత్నం.స్టార్ హీరోలు ఎవరైనా సరే మణిరత్నంతో సినిమా అంటే ఏ మాత్రం ఆలోచించకుండా, కథ కూడా వినకుండా ఒకే చెప్పేస్తారు.

TeluguStop.com - Netflix Give Big Offer To Ponniyin Selvan Rights

అతని ట్రాక్ రికార్డులు బ్లాక్ బస్టర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ట్రెండ్ సెట్టర్ సినిమాలు కనిపిస్తాయి.

రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్తున్న సినిమాకి కొత్త అర్ధం చెప్పిన దర్శకులలో మణిరత్నం ముందు వరుసలో ఉంటారు.ఇండియన్ టాప్ దర్శకుల జాబితా తీసుకుంటే అందులో మణిరత్నం టాప్ చైర్ లో ఉంటారు.

TeluguStop.com - మణిరత్నం పాన్ ఇండియా మూవీకి నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాంటి టాలెంటెడ్ దర్శకుడు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

చోళుల కాలం నాటి కథాంశంతో నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాక్ డౌన్ తరువాత మళ్ళీ రీసెంట్ గా ప్రారంభమైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే దీనికి ఉక్క హైప్ కారణంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.ఇక ఈ పోటీలో నెట్ ఫ్లిక్స్ ఇండియా మణిరత్నంకి సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఊహించని స్థాయిలో భారీ ఆఫర్ ని ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలలో వంద కోట్లకి అక్షయ్ కుమార్ సినిమాని డిస్నీ హాట్ స్టార్ మాత్రమే కొనుగోలు చేసింది.అయితే పొన్నియన్ సెల్వన్ డిజిటల్ రిలీజ్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆ సినిమాకి పెడుతున్న బడ్జెట్ కి రెట్టింపు రైట్స్ కోసం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం సుమారు 200 కోట్లు నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు.రెట్టింపు అంటే 400 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో పొన్నియన్ రిలీజ్ విషయంలో మణిరత్నంతో పాటు ఆ సినిమా నిర్మాతలు ఎటువైపు మొగ్గుతారనేది చూడాలి.

#Netflix #Kollywood #Ponniyin Selvan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు