నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న రకుల్‌ సినిమా.. ఏదో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది.టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Rakul And Arjun Kapoor Movie Sardar Ka Grandson Releasing In Netflix , Netflix,-TeluguStop.com

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.తన అందంతో మంచి గ్లామర్ ను సొంతం చేసుకుంటూ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో అవకాశం దక్కించుకుంది.అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంటుంది.

2009 లో కన్నడ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం కాగా.ఆ తర్వాత 2011లో కెరటం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమా తో తన నటన పట్ల మంచి గుర్తింపు పొందిన తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా అజయ్ దేవ్ గన్, మల్హోత్రా కాంబినేషన్ తో థాంక్ గాడ్ సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా అజయ్దేవగన్ దర్శకత్వంలో మరో సినిమా మేడే రాగా అందులో అమితాబ్ బచ్చన్ కి రూల్స్ పోషిస్తుంది.

Telugu Ajay Devgan, Amitab Bacchan, Arjun Kapoor, Neena Gupta, Netflix, Rakul, S

ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ తో నటిస్తున్న సినిమా ‘సర్దార్ కా గ్రాండ్ సన్’.ఈ సినిమాలో నటి నీనా గుప్తా కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమాను నెట్ ఫ్లెక్స్ వేదికలో విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో కథ.విదేశాల నుండి ఇండియాకు తిరిగి వచ్చిన ఓ యువకుడు, తన బామ్మ ఆఖరి కోరిక తీర్చడానికి ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ సినిమాలో చూపించనున్నారు.ఇక ఈ సినిమా లో బామ్మ పాత్ర గా నీనా గుప్తా నటించగా.ఇందులో నటిస్తున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube