అమ్మ బాబోయ్ : ఇంటికి వచ్చి వెళుతూ అత్త ని లైన్ లో పెట్టిన మేనల్లుడు... చివరికి...

ఈ మధ్య కాలంలో కొందరు పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితిలో మనుషులు బ్రతుకుతున్నారు.

 Nephew Married To The His Mother In Law In Bihar-TeluguStop.com

కాగా తాజాగా ఓ వ్యక్తి తన మేనల్లుడే కదా అని అల్లుడిని ఇంటికి పిలిస్తే ఆ అల్లుడు కాస్తా మేనత్తని లైన్ లో పెట్టి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే తన బంధువుల యువతిని పెళ్లి చేసుకున్నాడు.

 Nephew Married To The His Mother In Law In Bihar-అమ్మ బాబోయ్ : ఇంటికి వచ్చి వెళుతూ అత్త ని లైన్ లో పెట్టిన మేనల్లుడు… చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తన స్వగ్రామంలో పెద్దగా పనులు లేకపోవడంతో ముంబై నగరంలో నివాసముంటూ స్థానికంగా దొరికే పనులను చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.ఈ క్రమంలో ఈ వ్యక్తికి మేనల్లుడు వరుసయ్యే యువకుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.

అయితే ఈ మధ్య కాలంలో యువకుడు తన మేనత్తతో కొంతమేర చనువుగా ఉంటున్నాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.దీనికి తోడు వయసులో ఇద్దరూ సమానంగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఈ క్రమంలో యువకుడు తన మేనత్తని తీసుకొని పారిపోయి పెళ్లి చేసుకుని తన మేనమామ కాపురంలో చిచ్చు పెట్టాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వీడియోలో యువకుడు తన మేనత్త ని పెళ్లి చేసుకుంటున్న సమయంలో యువకుడి తల్లిదండ్రులు పక్కనే ఉండి ఆశీర్వదించారు.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు తప్పుదోవ పడుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

#Mumbai #NephewMarried #NephewMarriage #Bihar #Mother In Law

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు