ఈ కలియుగంలో కూడా అక్కడ ఇంకా ద్రౌపదులు ఉన్నారా...

ప్రపంచంలో అతి సుందరమైన దేశాల్లో నేపాల్ దేశం ఒకటి.ఇక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు, ఆచారాలు, ఆలయాలు, సుందరవనాలు, ఎత్తయిన పర్వతాలు వంటి వాటికి నేపాల్ దేశం ఎంతో ప్రసిద్ధిగాంచింది.

 Nepali Women News, Nepali Bride, Nepal Tourism, Nepal-TeluguStop.com

అయితే ప్రపంచ దేశాల్లో మరెక్కడా చూడని పురాతన వింత ఆచారం కూడా ఈ దేశంలో ఇప్పటికీ ప్రజలు ఆచరిస్తున్నారు.అయితే ఇంతకీ ఆచారం ఏమిటంటే ఈ దేశంలో ఒకే కుటుంబంలో అన్నదమ్ములుగా జన్మించినటువంటి యువకులు అందరూ కలిసి ఒకే మహిళను పెళ్లి చేసుకునే ఆచారాన్ని పాటిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే నేపాల్ దేశంలోని పశ్చిమ నేపాల్ ప్రాంతంలో పురాతన కాలం నుంచి కొన్ని తెగల ప్రజలు నివాసం ఉంటున్నారు.అయితే వీరికి ప్రస్తుత ప్రపంచంతో పెద్దగా సత్సంబంధాలు, అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ తమ పూర్వీకులు చెప్పినటువంటి ఆచారాలను పాటిస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా ఒకే కుటుంబంలో అన్నదమ్ములుగా జన్మించినటువంటి వ్యక్తులు ఒకే యువతిని పెళ్లి చేసుకోవచ్చనే ఆచారాన్ని ఆచరిస్తున్నారు.అయితే అన్నదమ్ములు అందరూ కలిసి యువతిని పెళ్లి చేసుకున్నప్పటికీ వారిలో యుక్త వయసు వచ్చేంత వరకు వారి భార్యతో శృంగారం చేయడానికి అనుమతించరు.

ఈ విషయం తెలుసుకున్న కొన్ని పాశ్చాత్య దేశ ప్రజలు ఈ ఆచారాన్ని రూపుమాపాలని ఆ దేశ అధికారులను కోరుతున్నారు.ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవులు ఎంతగానో పరిణితి మరియు అభివృద్ధి చెందారని ఇలాంటి కాలంలో కూడా ఒకే యువతిని నలుగురు, ఐదుగురు యువకులు కలసి పెళ్లి చేసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నేపాల్ టూరిజం విషయానికి వస్తే ఈ దేశం చారిత్రక కట్టడాలు మరియు పురాతన ఆలయాలు వంటి వాటికి పెట్టింది పేరు.అంతే కాక మంచి రుచికరమైన వంటకాలు కూడా ఇక్కడ బాగానే లభిస్తాయి.

దీంతో ఈ మధ్యకాలంలో నేపాల్ దేశం పర్యాటక రంగంలో బాగానే  అభివృద్ధి చెందుతోంది.అంతేగాక కొన్ని ప్రైవేటు సంస్థలుపర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి.

దీనికి తోడు అతి తక్కువ ఖర్చుతో దేశాన్ని చుట్టి రావచ్చు. దీంతో పర్యాటకులు నేపాల్ టూరిజం పై బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube