కొందరు చేసే పిచ్చి పనులు చూస్తే డాక్టర్లు సైతం ముక్కున వేలేసుకోవాల్సిందే.మలద్వారంలో, పురుషాంగంలో ఏవేవో వస్తువులు, చేపలు పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలో పడిన వారి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.
వీరు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారో డాక్టర్లు సైతం కనుగొనలేకపోయారు.అయితే ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన పని మాత్రం డాక్టర్లే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ నోరెళ్లబెట్టిలా చేస్తోంది.
ఇంతకీ అతడు ఏం చేశాడంటే.ఒక ప్లాస్టిక్ బాటిల్ లో తన మర్మాంగాన్ని దూర్చాడు.
దురదృష్టవశాత్తూ అది ఆ బాటిల్ లోనే రెండు నెలలపాటు చిక్కుకుపోయింది.ఈ విషయం గురించి బయట వ్యక్తులకు తెలిస్తే తన పరువు పోతుందేమోనని రెండు నెలలపాటు ఆసుపత్రికి కూడా వెళ్లలేదు.
కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతని ప్రైవేటు బాగా దెబ్బతింది.దాంతో తీవ్రమైన నొప్పితో సదరు వ్యక్తి తల్లడిల్లిపోయారు.
ప్రాణాలు కాపాడుకోవడం కోసం చివరికి వైద్యులను ఆశ్రయించాడు.చాలా కష్టంతో డాక్టర్లు అతడి మర్మాంగాన్ని సురక్షితంగా బాటిల్ నుంచి బయటికి తీసుకు వచ్చారు.ఈ ఘటన నేపాల్ దేశంలో జరిగింది.42 ఏళ్ల వ్యక్తి లైంగిక సుఖం పొందడం కోసం ఇలా బాటిల్ ని ఉపయోగించాడు.ఊహించని రీతిలో అది ఇరుక్కోవడంతో అతడు నరకయాతన అనుభవించాడు.
చివరికి వైద్యులు బాటిల్‌ను కేబుల్ వైర్ కట్టర్లతో చాలా జాగ్రత్తగా కత్తిరించి అతడి ప్రైవేట్ పార్టు బయటికి తీశారు.
రెండు నెలలుగా పురుషాంగం బాటిల్‌ల్లోనే ఉండిపోవడంతో సరిగా రక్తప్రసరణ జరగలేదు.దాంతో అతడి మర్మాంగం బాగా దెబ్బతింది.అయితే డాక్టర్లు మాట్లాడుతూ.సదరు వ్యక్తి భవిష్యత్తులో అంగ సమస్యలతో బాధ పడే ప్రమాదం ఉందని వెల్లడించారు.ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదని వైద్యులు మీడియాకి తెలిపారు.ఇలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
కాగా దీనికి సంబంధించిన వార్త కథనాలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా హోరెత్తుతున్నాయి.దీంతో నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
అరేయ్ ఏంట్రా ఇది అంటూ సెటైర్లు వేస్తున్నారు.