భారత్ సాయం కోరిన నేపాల్ !

ప్రపంచ దేశాలు ఇప్పటికే కరోనా నివారణకు వ్యాక్సిన్ ను కనిపెట్టి ప్రజలకు అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే నేపాల్ ప్రభుత్వం కూడా తమకు వ్యాక్సిన్ అందించే విషయంలో భారత్ సహాయం చెయ్యాలని కోరింది.

 Nepal Request To Indian Governament For Coronavirus Vacine, Narendra Modi, Harsh-TeluguStop.com

ఇప్పటికే ఆ ప్రభుత్వం భారత్ కు లేఖ రాసినట్లుగా ఆ దేశపు మీడియాలో కథనాలు వచ్చాయి.అందులో మా దేశంలో 20 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.2,60,000 మంది కరోనా సోకగా అందులో, 2000 మందికి పైగా కరోనా తో చనిపోయారు.ఆ దేశం మొత్తంకు కోవిడ్ 19 టీకాలు అందించడానికి భారత్ సహాయం కోరింది.

Telugu Coronavirus, India, Nepal-General-Telugu

భారత్ తో పాటుగా పలు దేశాలతో మరియు కంపెనీలతో నేపాల్ ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సిన్ ల విషయంలో సంప్రదింపులు జరుపుతుంది.భారత్ మాత్రం గతంలోనే కరోనా వ్యాక్సిన్ విషయంలో నేపాల్ కు ముందుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.కేంద్ర విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా నేపాల్ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్ లోని ఓ సమావేశంలో మాట్లాడుతూ నేపాల్ ప్రజలకు మేము భరోసా ఇస్తున్నాం తప్పకుండ కరోనా వ్యాక్సిన్ ను అందిస్తాం అన్నారు.ఈ మధ్యకాలంలో నేపాల్, చైనా తో చేతులు కలిపి భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి అందరికి తెలిసిందే.

భారత్ నేపాల్ సరిహద్దుల వెంబడి ఉన్న భూభాగం తమదే అంటూ నేపాల్ ఆరోపిస్తుంది.అవసరమైతే భారత్ తో యుద్దానికైనా నేపాల్ సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటనలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube