మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ కొలిచిన నేపాల్... ఎందుకో తెలుసా!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్టు శిఖరం అని చెప్పవచ్చు.ప్రపంచంలోనే ఎత్తైన ఈ శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతోమంది అనుభవజ్ఞులు ప్రయత్నించి శిఖరం పై దేశ జెండాను పాతుతున్నారు.

 Nepal Remeasured Mount Everest Height,nepal,mount Everest,nepal Remeasures,mount-TeluguStop.com

ఇలా ఎంతో మంది ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.చైనా ,నేపాల్ ప్రభుత్వాలు 1954 సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన డేటా ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు8,848 మీటర్లు (29,029 అడుగులు)గా నిర్ధారించబడింది.
అయితే ప్రస్తుతం ఈ ఎవరెస్టు శిఖరం ఎత్తు పై సందేహాలు తెలియజేసిన నేపాల్ ప్రభుత్వం తిరిగి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కొలవాలనే నిర్ణయం తీసుకుంది.2017 వ సంవత్సరంలో భూకంపం కారణంగా ఈ శిఖరం ఎత్తు పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అందుకోసమే నేపాల్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.కాగా ఎవరెస్టు శిఖరం ఎత్తును కొలవడానికి గత సంవత్సరం నుంచి పర్వతం ఎత్తున కొలుస్తూ డేటాను సేకరించారు.
అయితే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలవడం పూర్తిచేసుకున్న సర్వే డిపార్ట్మెంట్ అధికారులు తాజాగా వారు సేకరించిన డేటా ప్రకారం ఎవరెస్టు శిఖరం ఎంత ఎత్తు ఉందనే విషయాన్ని మంగళవారం అధికారికంగా తెలియజేస్తామని డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుశిల్ నార్సింగ్ రాజ్‌భండారి ఈ సందర్భంగా తెలియజేశారు అంతేకాకుండా ఎవరెస్ట్ ఎత్తు కోసం పనిచేసిన అధికారులను అదే కార్యక్రమంలో సత్కరించనట్లు ఆయన తెలిపారు.
భూకంపం కారణంగా ఎవరెస్ట్ ఎత్తు తగ్గి ఉంటుందని భావించిన నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తు ను కొలవడానికి చైనా సహాయ సహకారాలను నేపాల్ ప్రభుత్వం తీసుకొని గత ఏడాది పాటు ఈ పర్వతం ఎత్తు కొలుస్తూ డేటాను సేకరించారు.

అయితే పర్వతం ఎత్తు కొలవడం పూర్తవడంతో ఎవరెస్టు శిఖరం ఎంత ఎత్తు ఉందన్న విషయం మంగళవారం అధికారికంగా తెలియజేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube