శ్రీరాముడు భారతీయుడు కాదు అంటున్న నేపాల్ ప్రధాని

గత కొంత కాలంగా నేపాల్ ప్రధాని భారతదేశంపై పదే పదే సంచలన వ్యాఖ్యలు చేస్తూ భారతీయుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.భారత్లోని భూభాగాన్ని తమధిగా చూపిస్తూ కొత్త మ్యాప్ తయారు చేసింది.

 Nepal Prime Minister Comments On Lord Sri Rama, Indian Government, China, Hindui-TeluguStop.com

తరువాత ప్రతిసారీ భారత్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు.కావాలనే భారత్ ని రెచ్చగొడుతున్నారు.

వారి ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం వస్తే దానికి కారణం భారత్ అని విమర్శలు చేస్తున్నారు.అయితే కె.పి ఒలేె ఎన్ని విమర్శలు చేసినా కూడా భారత ప్రభుత్వం మాత్రం ఎదురు దాడి చేయడం లేదు.నేపాల్ ప్రదర్శిస్తున్న విమర్శల వెనుక చైనా హస్తం ఉందని భారత ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

వారి అండదండలు చూసుకొని నేపాల్ ప్రధాని రెచ్చిపోతున్నారు అని భావిస్తున్నారు.దీంతో నేపాల్ ప్రధానితో పాటు ఆ దేశానికి చెందిన నేతలు ఎలాంటి విమర్శలు చేసిన పడవ భారత ప్రభుత్వం సైలెంట్ గానే ఉంటుంది.

అయితే తాజాగా నేపాల్ ప్రధాని భారతీయ అందరికీ కూడా అసహనం కలిగించే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.మారుతి సమాచారం హిందువులు ఆరాధ్య దైవమైన శ్రీ రాముడు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రీరాముడు భారతదేశంలో అయోధ్య నగరంలో పుట్టాడని అందరూ భావిస్తారు.అలాగే రామాయణం హిందువుల పవిత్ర గ్రంధాలలో ఒకటిగా అలరారుతోంది.

అలాంటి శ్రీరాముడు అసలు భారతీయుడే కాదని, శ్రీరాముడు పుట్టింది నేపాల్ అని, నేపాల్ దేవుడిని హిందువులు తమ ఆరాధ్యుడిగా, భారతీయుడుగా ప్రచారం చేసుకుంటున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు.అయితే ఈ విమర్శలపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే నేపాల్ లో కూడా మెజారిటీ హిందువులు వారి ప్రధాని మాటలను తప్పు పడుతున్నారు.దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది.

అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube