భారత్ తో యుద్ధానికి మేము సిద్ధం అంటున్న నేపాల్ మంత్రి

గత కొద్ది రోజులుగా మన పొరుగు దేశం, ఎప్పటి నుంచో భారత్ కి విశ్వాసపాత్రుడుగా ఉన్న నేపాల్ ఇప్పుడు భారత్ మీద కాలు దువ్వుతుంది.

చైనా ఆధిపత్యం చేరలో ఇరుక్కొని వారు ఆడించినట్లు ఆడుతుంది.

అందులో భాగంగా అదే పనిగా భారత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో పాటు భారత్ భూభాగాలని తమవని వాదిస్తుంది.ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారత్, నేపాల్ మధ్య వైరం చర్చనీయాంశంగా మారింది.

దీని వెనుక కుట్ర కోణం ఏంటి అనేది ఓ వైపు భారత్ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు నేపాల్ ని నియంత్రించే పని చేస్తుంది.అయితే ఆ దేశ ప్రభుత్వ పెద్దలు మాత్రం నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు.

అవసరమైతే ఇండియాతో యుద్ధం చేయడానికి తమ దేశ గూర్ఖా సైన్యం సిద్ధంగా ఉందని నేపాల్ మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర తదితర ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తున్న వేళ, భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే, ఇటీవల మాట్లాడుతూ, మరో దేశం తరఫున నేపాల్ వకాల్తా పుచ్చుకుందని వ్యాఖ్యానించారు.

Advertisement

తమ దేశానికి అత్యవసరమైతే నేపాల్ సైన్యం స్వయంగా రంగంలోకి దిగాలే తప్ప, మరొకరిపై ఆధారపడరాదని వ్యాఖ్యానించారు.నరవాణే వ్యాఖ్యలను ప్రస్తావించిన ఈశ్వర్ పోఖ్రేల్, రాజకీయ ఉద్దేశాలతో తమ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.

గూర్ఖా బలగాలకు ఎదురుగా నిలవడం ఇండియాకు కష్టంగా మారినట్టుందని అన్నారు.సమయం వచ్చి, యుద్ధమే అవసరమైతే తమ సైన్యం సిద్ధంగా ఉందని, దీటుగా బదులిచ్చేందుకు వెనుకాడదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు