ఎవరెస్టు శిఖరం సమున్నతమే...!

ప్రపంచంలోనే అతి ఎత్తయిన మంచు పర్వతం ఎవరెస్టు శిఖరం.గొప్పవారిని మన ఎవరెస్టు శిఖరంతో పోలుస్తాం.

 Everest Height Unchanged-TeluguStop.com

ఈ సమున్నత హిమగిరి నేపాల్‌లో ఉన్న సంగతి మనకు తెలుసు.భూకంపానికి నేపాల్‌ అతలాకుతలమైపోయింది.

ఛిద్ర మైపోయింది.ఒక్క మాటలో చెప్పలంటే సర్వ నాశనమైపోయింది.

అపార ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి.ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా లేదు.

భూకంపం ధాటికి రాజధాని నగరం ఖాట్మండు దక్షిణం వైపునకు కొన్ని మీటర్లు జరిగిపోయింది.ఈ నేపథ్యంలో ఎవరెస్టు శిఖరం చెక్కుచెదరలేదని, దాన్ని ఎత్తు ఇంచి కూడా తగ్గలేదని శాస్ర్తవేత్తలు చెప్పారు.

ఎవరెస్టు ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు.అంటే ఇరవై తొమ్మదివేల ఇరవై తొమ్మిది అడుగులు.

శాస్ర్తవేత్తలు చెబుతున్నదాని ప్రకారం సాధారణంగా భూకంపాలు నష్టం కలిగించవు.అటవీ ప్రాంతాల్లో, జనసంచారంలేని ఎడారుల్లో భూకంపాలు వస్తూనే ఉంటాయి.

అయితే అక్కడ జనంలేకపోవడం, లక్షలాది కాంక్రీటు భవనాలు.ఇతర నిర్మాణాలు లేకపోవడంతో భూమి కంపించినా ఏమీ కాదు.

కాని నగరాల్లో భూకంపం వస్తే జనం, భవనాలు, భారీ నిర్మాణాలు ఉంటాయి కాబట్టి అపార నష్టం జరుగుతుంది.ఎవరెస్టు శిఖరం కదలకపోయినా దాని మీద ఉన్న కొందరు పర్వాతారోహకులు మాత్రం చనిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube