నేపాల్ తో మనకు ఉన్న ఆ బంధం తెగిపోయింది.. ఈ సంచలన నిర్ణయంకు కారణం ఏంటంటే..?  

Nepal Bans Indian Currency Notes Above Rs 100 Denomination -

ఒక దేశపు కరెన్సీ మరో దేశంలో చెల్లదు.కాని మన పక్కన ఉన్న దేశం అయిన నేపాల్‌లో ఇండియన్‌ కరెన్సీ చెల్లుబాటు అవుతూ ఉండేది.

Nepal Bans Indian Currency Notes Above Rs 100 Denomination

కాని ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది.ఇండియన్‌ కరెన్సీని ఇన్నాళ్లు అక్కడ ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేది.

అక్కడి ప్రజలు ఇండియన్‌ కరెన్సీని వాడేందుకు ఓకే చెప్పేవారు.కాని కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఎక్కువ శాతం బ్లాక్‌ మనీ అక్కడ చెలామణి అవుతూ వస్తుందట.

నేపాల్ తో మనకు ఉన్న ఆ బంధం తెగిపోయింది.. ఈ సంచలన నిర్ణయంకు కారణం ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

దాంతో నేపాల్‌ బ్లాక్‌ మనీని కట్టడి చేయడంలో విఫలం అయ్యింది.బ్లాక్‌ మనీ కారణంగా ఎంతో మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఇన్ని రోజులు కొత్త నోట్లను అధికారికంగా గుర్తించకున్నా కూడా అక్కడ చెలామణి అవుతూ వచ్చాయి.కాని ఇకపై నేపాల్‌లో ఇండియన్‌ కరెన్సీని తీసుకోవడం కాని ఇవ్వడం కాని ఉండదని అంటున్నారు.ఒకవేళ తమ వద్ద ఇండియన్‌ కరెన్సీ ఉంటే వెంటనే నేపాల్‌లో ఉన్న ఇండియన్‌ అంబసీలో మార్పించుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇండియన్స్‌ ఎక్కువగా నేపాల్‌లో వ్యాపారాలు కలిగి ఉండటం, నేపాలీస్‌ ఎక్కువగా ఇండియాలో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవడం చేస్తారు.

అందుకే ఇండియన్‌ కరెన్సీని అక్కడ వినియోగించారు.

ఇండియన్‌ కరెన్సీ వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించిన అక్కడి ప్రభుత్వం వెంటనే నోట్లను చెలామణి లేకుండా చేయాలని భావించింది.అందుకోసం అక్కడ ప్రభుత్వం జీవోను కూడా ఇచ్చింది.దాంతో ఇకపై నేపాల్‌లో ఇండియన్‌ కరెన్సీ కనిపించదు.

ఒక వేళ కనిపించినా అది మార్పించుకునేందుకు అంబసీ వెళ్లాల్సిందే.ఇండియాలో ఉంటున్న నేపాలీస్‌కు అక్కడి కరెన్సీ అందుబాటులో ఉంచేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇన్నాళ్లు ఇండియా మరియు నేపాల్‌ కరెన్సీ బంధంను కలిగి ఉన్నాయి.తాజా నేపాల్‌ నిర్ణయంతో ఆ బంధం తెగి పోయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు