నోయల్ కూడా అదే మాట.. పులిహోర ముచ్చట్లకే ఎక్కువ స్కోప్‌ ఇస్తున్నారు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నుండి ఎలిమినేట్‌ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే చెబుతున్నారు.అదేంటి అంటే నేను చాలా చేశాను కాని ప్రేక్షకులకు నన్ను తక్కువ చూపించారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

 Neol Comments On Telugu Bigg Boss Editors   Noel, Telugu Big Boss 4, Surya Kiran-TeluguStop.com

మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయిన సూర్య కిరణ్‌ నుండి మొదలుకుని మొన్న అనారోగ్య కారణంగా ఎలిమినేట్‌ అయిన నోయల్‌ వరకు దాదాపు అంతా కూడా నన్ను తక్కువ చూపించారు అంటూ అసహనం వ్యక్తం చేయడం చూస్తుంటే ప్రేక్షకులకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హౌస్‌లో పులిహోర బ్యాచ్‌ కామెడీ బ్యాచ్‌ ను ఎక్కువగా చూపిస్తున్నారు.

గొడవలు మరియు రొమాన్స్‌లు డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లను మాత్రమే చూపించేందుకు ఎడిటర్స్‌ ఆసక్తిగా ఉన్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విషయంలో నోయల్‌ కూడా చేసిన విమర్శలు వివాదాస్పదం అయ్యాయి.

నోయల్‌ కూడా తాను చాలా టాస్క్‌లో పార్టిసిపేట్‌ చేశాను.కాని నన్ను చూపించింది చాలా తక్కువ.

నేను బాత్‌ రూంలో ఏమైనా దాచుకున్నాన.నన్ను ఎందుకు చూపించ లేదు అంటూ ప్రశ్నించాడు.

నోయల్‌ అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా కనిపించలేదు అంటూ అంతా అనుకున్నారు.కాని నోయల్‌ బయటకు వచ్చిన తర్వాత తాను చాలా టాస్క్‌ ల్లో కష్టపడ్డాను.

కాని ఎక్కువగా నన్ను చూపించలేదు అంటూ వ్యాఖ్యలు చేయడంతో మోనాల్‌ చుట్టు కెమెరాలు ఎక్కువగా తిరిగాయేమో అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మొత్తానికి బిగ్‌ బాస్‌ హౌస్ లో ఉన్న వారు ఎంత ప్రతిభవంతులు అయినా కూడా చిల్లర కామెడీ చేయడం లేదా ఎవరితోనో ఒకరితో రిలేషన్‌ లో ఉండటం చేస్తేనే చూపిస్తారేమో అంటూ నోయల్‌ కామెంట్స్‌ చేశాడు.

ఇవే కామెంట్స్‌ గతంలో ఎలిమినేట్‌ అయిన వారు కూడా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube