చిన్నారి కిడ్నాప్ కేసును నెల్లూరు పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు.ఇందుకూరుపేట మండలం గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద పల్లవి అనే చిన్నారిని ఇద్దరు మహిళలు స్కూటీపై అపహరించుకుని వెళ్లారు.
దీంతో గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు అత్యాధునిక సాంకేతికతతో విచారణ చేపట్టారు.
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.పల్లవిని తల్లిదండ్రులకి అప్పగించారు.
ప్రమీల, శ్వేత అనే మహిళలు పాపని అమ్మేయాలనే కిడ్నప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓ మహిళ తన కూతురు మృతి చెందడంతో తనకి ఓ కూతురు కావాలని, ఎంత డబ్బు అయినా ఇస్తాననడంతో ఈ కిడ్నాప్ పథకానికి ఇద్దరు మహిళలు ప్రయత్నించారు.
సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి, సిగ్నల్స్ ద్వారా వారిని అరెస్టు చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ విజయారావు అభినందించారు.