ఈజిప్టు ఉల్లి కోసం లొల్లి పెట్టుకున్న జనం

దేశవ్యాప్తంగా ఉల్లి పెట్టి్స్తు్న్న కన్నీళ్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.కొండెక్కి కూర్చున్న ఉల్లి ధర ససేమిరా దిగననడంతో ప్రజలు ఉల్లి కోసం లొల్లి చేస్తున్నారు.

 Nellore People Fight For Egypt Onion-TeluguStop.com

ప్రభుత్వం అందించే సబ్సిడీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టి వేచి చూస్తున్నారు.అయినా కూడా కొందరికి ఉల్లి దొరక్కపోవడంతో వారు ఉసూరుమంటున్నారు.

ఎలాగైనా ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

అయితే తాజాగా నెల్లూరులో ఉల్లి కోసం జనం లొల్లి పెడుతున్నారు.

ఉదయగిరి మార్కెట్‌లోకి కడప నుండి లారీలో వచ్చిన ఓ ఉల్లి లోడును చూసి అక్కడి జనాలు అవాక్కయ్యారు.ఆ లోడులో ఉన్న ఉల్లి ఏకంగా దానిమ్మకాయ సైజులో ఉండటమే దీనికి కారణం.

ఈజిప్టు నుండి వచ్చిన ఈ ఉల్లి సాధారణ ఉల్లికంటే ఎక్కువ బరువు ఉందని అక్కడి జనం నోరెళ్లబెట్టారు.సాధారణ ఉల్లిపాయ 50 నుంచి 100 గ్రాములు బరువు ఉంటుంది.

కానీ ఈజిప్టు ఉల్లిపాయ 250 నుంచి 450 గ్రాముల బరువు ఉంది.ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది.కాగా ఈజిప్టు ఉల్లి కిలో రూ.50లకు విక్రయిస్తున్నారు.కానీ ఈ ఉల్లి సాధారణ ఉల్లిలాగా ఘాటుగా లేదని కొన్నవారు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube