Nellore kavitha : ఒక ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తే అన్ని రూ.వేలు.. నెల్లూరు కవిత ఏం చెప్పారంటే?

ఈ మధ్య కాలంలో ఈటీవీ ఛానల్ ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలలో నెల్లూరు కవిత ఒకరు.నెల్లూరులో ఈవెంట్లు చేయడం ద్వారా ఫేమస్ అయిన కవిత ప్రస్తుతం వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీ అవుతున్నారు.

 Nellore Kavitha  Event Remuneration Details Here Goes Viral In Social Media , Ne-TeluguStop.com

తాజాగా కవిత ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. కండక్టర్ ఝాన్సీ నాకు అక్క అని ఆమె అన్నారు.

నాన్న లారీ డ్రైవర్ అని కవిత పేర్కొన్నారు.మమ్మీ ఆస్పత్రిలో ఆయాగా పని చేసేదని తెలిపారు.బ్రదర్ కూడా ఆస్పత్రిలోనే పని చేస్తున్నారని నేను ఇంటర్ వరకు చదువుకున్నానని కవిత వెల్లడించారు.నేను టీచర్ కావాలని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఫస్ట్ లో పేమెంట్లు తక్కువగా ఉండేవని ఆమె అన్నారు.లేడీ డ్యాన్సర్లకు 5000, యాంకర్లకు 9000 పేమెంట్ ఇస్తారని ఆమె అన్నారు.

Telugu Etv Shows, Jhansi, Nellore Kavitha, Tollywood-Movie

కవిత స్టార్టింగ్ లో 500 అలా తీసుకున్న రోజులు కూడా ఆమె కామెంట్లు చేశారు.మాకు ఇచ్చే డబ్బులలో కొంత మొత్తాన్ని ఈవెంట్ ఆర్గనైజర్లు తీసుకున్నారని కవిత చెప్పుకొచ్చారు.కవిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈవెంట్లలో పాల్గొనే వాళ్లకు లక్షల్లో ఆదాయం ఉంటుందని జరిగే ప్రచారంలో నిజం లేదని కవిత పరోక్షంగా వెల్లడించడం గమనార్హం.

కవిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.నెల్లూరు కవిత ఈ స్థాయికి ఎదగడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.

కొంతమంది విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను పట్టించుకోకుండా నెల్లూరు కవిత కెరీర్ ను కొనసాగిస్తున్నారు.నెల్లూరు కవితకు ఈటీవీ ఛానల్ షో తర్వాత ఆఫర్లు, రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో పెరిగాయి.నెల్లూరు కవితకు క్రేజ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube