నెల్లూరు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరువ అయ్యింది.ఇదే సమయంలో ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రెండు మిలియన్‌ లకు అతి చేరువగా ఉంది.

 Nellore District Kavali Complete Lockdown, Lockdown, August1st, Corona Cases, De-TeluguStop.com

ఇక ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది.మొన్నటి వరకు పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో మాత్రమే కరోనా విజృంభిస్తూ వచ్చింది.

ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానికంగా లాక్‌ డౌన్‌లు అమలు చేస్తున్నారు.దేశంలో లాక్‌ డౌన్‌ ఎత్తి వేస్తూ ఉంటే స్థానిక సంస్థలు మాత్రం లాక్‌ డౌన్‌కు సిద్దం అవుతున్నాయి.

దేశంలో ఆగస్టు 1 నుండి 90 శాతం లాక్‌ డౌన్‌ ఎత్తివేసినట్లే.అయితే కొన్ని చిన్న పట్టణాలు మరియు నగరాల్లో మాత్రం లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఏపీలో కరోనా కేసుల్లో నెల్లూరు జిల్లా టాప్‌ లో ఉంది.అక్కడ మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది.ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలిలో మృతుల సంఖ్య స్థానికులను భయపెడుతోంది.కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఏడుగురు వ్యాపారులు కరోనాతో మృతి చెందినట్లుగా వెళ్లడయ్యింది.

దాంతో కావాలి మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.పది రోజుల పాటు కావలి మాత్రమే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తం కూడా సంపూర్ణ లాక్‌ డౌన్‌ చేస్తే పరిస్థితి కాస్త అయినా అదుపులోకి వస్తుందని జనాలు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube