నేల టిక్కెట్‌కు దెబ్బేస్తోందెవ‌రు...       2018-05-19   02:22:08  IST  Raghu V

మాస్ మ‌హ‌రాజ్ చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత గ‌తేడాది రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టినా ఈ యేడాది ఆరంభంలో వ‌చ్చిన ట‌చ్ చేసి చూడు సినిమాతో ఘోర‌మైన డిజాస్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ట‌చ్ చేసి చూడు త‌ర్వాత మూడు నెల‌ల గ్యాప్‌లోనే ర‌వితేజ మ‌రోసారి నేల టిక్కెట్‌తో వ‌చ్చే శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు ఐదారు రోజులే టైం ఉన్నా అస్స‌లు బ‌జ్ క్రియేట్ అవ్వ‌లేదు.

ఇప్ప‌టికే టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో పాటు ఆడియో, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చి మ‌రీ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం ఇన్ని చేసినా బిజినెస్ వ‌ర్గాల్లో కూడా ఎందుకో క్రేజ్ లేదు. సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు హిట్ సినిమాలు ఇచ్చిన కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెండు హిట్ సినిమాల డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేసిన సినిమా అంటే అంచ‌నాలు ఎలా ఉండాలి ? అయితే నేల టిక్కెట్‌కు మాత్రం ఆ రేంజ్‌లో బ‌జ్ లేదు.
ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ రెండూ చాలా నార్మ‌ల్‌గా ఉండ‌డంతో బయ్య‌ర్లు కూడా భారీ రేట్లు పెట్టేందుకు ముందుకు రాని ప‌రిస్థితి. టైటిల్ నుంచి టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో డైలాగులు వ‌ర‌కు అన్ని ప‌ర‌మ రొటీన్‌గా ఉండ‌డంతో పాటు ర‌వితేజ న‌ట‌న కూడా కొత్త‌గా లేక‌పోవ‌డంతో దీనిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇక ర‌వితేజ చివ‌రి సినిమా ట‌చ్ చేసి చూడు ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు పోయిందో కూడా జ‌నాల‌కు తెలియ‌క‌పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా మీద ప‌డింది.
ర‌వితేజ సినిమాకు టాక్ ఎంతో బాగుంద‌ని వ‌స్తే త‌ప్పా ఆడ‌డం లేదు. రాజా ది గ్రేట్ ఇందుకు నిద‌ర్శ‌నం. అదే తేడా కొడితే అస్స‌లు క‌న‌ప‌డ‌డం లేదు. ఇక ఇప్పుడు పూర్ బ‌జ్‌తో స్టార్ట్ అవుతోన్న నేల టిక్కెట్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఆస‌క్తిగా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ ఫెయిల్ అయ్య‌డు. మ‌రి నేల టిక్కెట్ ఏం చేస్తుందో ? శుక్ర‌వారం తేలిపోనుంది.