నాకెందుకు ప్రపోజ్ చేయలేదన్న అనసూయ.. నెటిజన్లు ఏమన్నారంటే..?

బుల్లితెర యాంకర్ అనసూయకు సోషల్ మీడియా ఖాతాలలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.అనసూయ ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తన షోలకు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.

 Neizen Funny Comments Abotu Anchor Anasuya Bharadwaj Video-TeluguStop.com

నెటిజన్ల కామెంట్లను పెద్ద పట్టించుకోని అనసూయ హద్దులు దాటి కామెంట్లు చేస్తే మాత్రం ఘాటు కౌంటర్లు ఇస్తుంటారు.

ఇటీవల విడుదలైన చావుకబురు చల్లగా సినిమాతో అనసూయ ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

 Neizen Funny Comments Abotu Anchor Anasuya Bharadwaj Video-నాకెందుకు ప్రపోజ్ చేయలేదన్న అనసూయ.. నెటిజన్లు ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఒక లైలా కోసం సినిమాలోని పూజా హెగ్డే డబ్ స్మాష్ వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో నాకు ఎందుకు ప్రపోజ్ చేయలేదురా దానికి చెప్పావ్ శృతికి చెప్పావ్ గీతకు చెప్పావ్ అనే డైలాగ్స్ కు పర్ఫెక్ట్ లిప్ సింక్ తో అనసూయ వీడియో చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లను పెడుతున్నారు.కొందరు నెటిజన్లు అనసూయకు ఐలవ్యూ అని ప్రపోజ్ చేస్తుంటే మరి కొంతమంది అనసూయ మ్యారేజ్ చేసుకుంది కాబట్టే తాము ప్రపోజ్ చేయలేదని చెబుతున్నారు.అనసూయ షేర్ చేసిన వీడియోకు 46,000కు పైగా లైకులు రాగా భారీ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.డబ్ స్మాష్ వీడియోలతో అనసూయ తన ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

మరోవైపు 2021 సంవత్సరంలో అనసూయ చేతిలో భారీగానే సినిమా ఆఫర్లు ఉన్నాయి.అనసూయ నటించబోయే సినిమాల్లో ఒక్క సినిమా హిట్టైనా ఆమెకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ఆమె నటించబోయే సినిమాల్లో స్టార్ హీరోల సినిమాల కంటే మిడిల్ రేంజ్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Netizen #Khiladi #Funny Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు