ఆదివారంనాడు నేహా ధూపియా, అంగద్ బేడీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.వీరి ఫ్యామిలీ ఇద్దరి నుంచి ముగ్గురుగా మారింది.
అవును.నేహా ధూపియా ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ పాపకు జన్మనిచ్చారు.
ఈ ఏడాదే నేహా, అంగద్ ఒక్కటయిన సంగతి గుర్తుండే ఉంటుంది.కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్న వీళ్లు మే నెలలో వివాహం చేసుకున్నారు.
నేహ-అంగద్‌బేడీ వివాహం ఈ ఏడాది మే 10న జరిగింది.ఆగస్టులో నేహ గర్భవతి అయినట్టు తెలిపింది.తాజాగా, తమకు బిడ్డ పుట్టినట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ప్రెగ్నెన్సీ సమయంలోనూ నేహ తన టాక్ షోలో పాల్గొనేది.కాగా, నేహ దంపతులు పాపకు జన్మనిచ్చిన విషయం వెలుగులోకి వచ్చినవెంటనే బాలీవుడ్ ప్రముఖులు తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు.సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది మే 10న ప్రేమ వివాహం చేసుకున్న నేహా… పెళ్లికి ముందే అతడి వల్ల గర్భం దాల్చదనే వార్తలతో హాట్ టాపిక్ అయ్యింది.ఈ విషయాన్ని మొదట్లో రహస్యంగా ఉంచినప్పటికీ.ఆగష్టులో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు