తారక్ కు అలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందా.. రాంగ్ ఛాయిస్ అని చెబుతున్నారా?

Negative Feedback For Young Tiger Ntr Evaru Meelo Kooteeswarulu Show

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రియాలిటీ షోలలో ఒకటైన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ షోపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఆసక్తి ఏర్పడింది.

 Negative Feedback For Young Tiger Ntr Evaru Meelo Kooteeswarulu Show-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ ఈ సీజన్ కు మాత్రమే హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తరువాత సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించరని తెలుస్తోంది.తారక్ కు ఈ షో గురించి సన్నిహితులు, అభిమానుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

సెకండ్ సీజన్ కు ఎక్కురెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినా తారక్ మాత్రం తాను హోస్ట్ గా మరో సీజన్ కు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నట్టు సమాచారం.ఒకవైపు నాగ్ బిగ్ బాస్ షోకు మంచి రేటింగ్స్ రాబడుతుంటే ఎన్టీఆర్ షోకు మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

 Negative Feedback For Young Tiger Ntr Evaru Meelo Kooteeswarulu Show-తారక్ కు అలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందా.. రాంగ్ ఛాయిస్ అని చెబుతున్నారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి హోస్ట్ గా చేసిన సమయంలోనే ఫ్లప్ అయిన షోను ఎంపిక చేసుకుని ఎన్టీఆర్ తప్పు చేశాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

జెమినీకి ఇతర ఛానెళ్ల స్థాయిలో రీచ్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నా ఫలితం మాత్రం తక్కువగానే ఉంది.

ఎన్టీఆర్ హోస్ట్ అయిన తర్వాత కూడా ఈ ఛానల్ స్థానం మారలేదు.ఈ షోతో పాటు మొదలైన మాస్టర్ చెఫ్ షో కూడా ఫ్లాప్ షో అనిపించుకుంది.

వారంవారానికి తగ్గుతున్న రేటింగ్ వల్ల ఎన్టీఆర్ కూడా బాధ పడ్డారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ భవిష్యత్తులో రియాలిటీ షోలకు దూరమయ్యే ఛాన్స్ కూడా ఉంది.

రియాలిటీ షోకు బ్యాడ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.కొరటాల శివ సినిమాను త్వరగానే మొదలుపెట్టాలని ఎన్టీఆర్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.

#Audience #Feed #EvaruMeelo #Gemini TV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube