అప్పట్లో పవన్ తో విడాకుల కోసం తన మొదటి భార్య చాలా చేసిందంటూ ప్రచారం... చివరికి...

టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి సౌత్ ఇండియాలో దాదాపు తెలియని వారు ఉండరు.అయితే సినిమాల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అప్పట్లో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

 Negative Fans Advertising False News About Pawan Kalyan First Wife Nandini-TeluguStop.com

ఈ క్రమంలో తన వ్యక్తిగత కారణాల వల్ల మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.దీంతో ఈ మధ్య కాలంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక అతడి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి కొందరు నెగటివ్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో నందిని గురించి అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు.ఇందులో భాగంగా అప్పట్లో నందిని ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానసికంగా హింసించేవాడని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్త్రీలోలుడని దీంతో ఈ విషయాలను భరించలేక నందిని అతడి నుంచి విడాకులు తీసుకుందని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

 Negative Fans Advertising False News About Pawan Kalyan First Wife Nandini-అప్పట్లో పవన్ తో విడాకుల కోసం తన మొదటి భార్య చాలా చేసిందంటూ ప్రచారం… చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా నందిని విడాకులు తీసుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ మరియు అతడి కుటుంబ సభ్యులపై కేసు కూడా పెట్టిందని కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసు నిలబడలేదని మరికొందరు అంటున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ తో తన మొదటి భార్య నందిని కి మనస్పర్ధలు, విభేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ తన భార్యని హింసించలేదని అప్పట్లో నందిని పేర్కొంది.

అయితే తన కుటుంబ పోషణ నిమిత్తమై డబ్బు కావాలని డిమాండ్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించి దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా డబ్బు భరణంగా ముట్టజెప్పినట్లు అప్పట్లో పలు కథనాలు వినిపించాయి.దీంతో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం వల్ల మరియు ప్రచారాలు చేయడం వల్ల మీకు ఒరిగేదేమీ లేదంటూ ఘాటుగా నెగిటివ్ అభిమానులకి రిప్లై ఇస్తున్నారు.

అంతేకాకుండా ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలనే విషయం పూర్తిగా అతడి వ్యక్తిగతమని అంతేగాని రాజకీయ లబ్ధి కోసం, స్వ లబ్ది కోసం ఉన్నవీ లేనివీ కల్పించి ఒక ప్రముఖ సెలబ్రెటీ మరియు రాజకీయ నాయకుడి గురించి ప్రచారాలు చేయడం సరికాదని అంటున్నారు.

Telugu Nandini, Negative Fans Advertising False News About Pawan Kalyan First Wife Nandini, Pawan Kalyan, Pawan Kalyan First Wife, Pawan Kalyan First Wife Nandini Divorce, Power Star, Telugu Hero-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా 2007వ సంవత్సరంలో నందినికి పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వడంతో ఆ తర్వాత మళ్ళీ నందిని ఓ ప్రముఖ డాక్టర్ ని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.ఆ తరవాత నందిని ఎక్కడుంది.? ఏం చేస్తుంది.? అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే.

#Pawan Kalyan #FansFalse #Nandini #Pawan Kalyan #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు