కార్తీకదీపం డైరెక్టర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం?

ఒక అగ్రహీరో సినిమాకున్న పాపులారిటీ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం.తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఈ సీరియల్ బుల్లితెరలో ప్రసారమయ్యే అన్నిటికంటే… ఒక ట్రెండింగ్ ని సృష్టిస్తూ వస్తుంది.

 Negative Comments And Trolls On Karthika Deepam Serial-TeluguStop.com

ఇంటిల్లిపాదీ మెచ్చిన సీరియల్ గా పేరుతెచ్చుకున్న కార్తీక దీపం… రోజుకో మలుపులు తిరుగుతోంది వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ నటన ఈ సీరియల్ కి పెద్ద అస్సెట్.

కానీ గత కాలంగా ఈ సీరియల్ పైన పలు కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.

 Negative Comments And Trolls On Karthika Deepam Serial-కార్తీకదీపం డైరెక్టర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్ లో దీప-కార్తీక్‌లను కలపడానికి నేటితో 1143 ఎపిసోడ్‌లు అంటే… దాదాపు మూడున్నరేళ్లు టైం తీసుకున్నారు.అంతా సెట్టైంది.

ఇక ముగిస్తుంది కథ అనుకంటున్న సమయంలోనే…ఆ మోనిత నెలతప్పింది.ఆ నెపం డాక్టర్ బాబుపైకి నెట్టింది.

దీంతో కథ మళ్లీ మొదలు.దీప ఏడుపుతో మోనిత శాడిజం రెట్టింపు అయ్యింది.

దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది.

ఒకప్పుడు ఈ సీరియల్ అంటే అత్యంత ఇష్టం చూపించే వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు.

మోనిత చనిపోయినట్టు నాటకం డాక్టర్ బాబు జైలుకి పోవడం సిన్సియర్ ఆఫీసర్ అయిన రోషిణిని డమ్మీగా మార్చి మోనిత ఆడిందే ఆట అన్నట్టుగా అసలు లాజిల్‌లు లేకుండా మార్చేయంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మోనిత మిస్సింగ్ తరువాత వివిధ వేషాలు మార్చడం.

స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చినా ఎవరూ గుర్తించలేకపోవడం.

Telugu 1143 Episodes, Comment, Deepa, Director Kapuganti Rajendra, Doctor Babu, Doctor Babu Jail, Karthika Deepam, Monitha, Premi Vishwanath, Serial, Trending Serial, Trools, Vantalakka-Movie

అలాగే హాస్పటల్‌కి మారువేషంలో వచ్చినా సిబ్బంది గానీ,పోలీసులు కానీ గుర్తించలేకపోడం మరీ లాజిక్ లేకుండా నడిపిస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.సిన్సియర్ ఆఫీసర్ అయిన రోషిణికి కనీసం సీసీ కెమెరాలు చూడాలనే ఆలోచన రాదా? డైరెక్టర్ మరీ తెలివి లేకుండా సీరియల్ ని తీస్తున్నాడని బుల్లితెర ప్రేక్షకులు తిట్టి పోస్తున్నారు.

అయితే ఎంత తిట్టినా… ఎంత దుమ్మెత్తి పోసినా… సీరియల్ ని చూసే వాళ్ల సంఖ్య తగ్గట్లేదు.

అభిమానులు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అదే జాతీయ స్థాయిలో నంబర్ 1 రేటింగ్ ని ఇస్తూనే ఉన్నారు.అందుకే దర్శకుడు ఎలా తీసినా .కార్తీకదీపం రోజు రోజుకీ విరాజిల్లుతూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది.మరికొంత మంది ఈ సీరియల్ బాధితులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లగక్కుతున్నారు.

Telugu 1143 Episodes, Comment, Deepa, Director Kapuganti Rajendra, Doctor Babu, Doctor Babu Jail, Karthika Deepam, Monitha, Premi Vishwanath, Serial, Trending Serial, Trools, Vantalakka-Movie

‘ఈ సీరియల్ ఎప్పుడు అవుతుందా?? మా ఆవిడ నాకు అన్నం ఎప్పుడు అవుతుందా? అని ఎదురుచూస్తుంటా.అని కొందరంటే… లేని పోని లాజిక్ లు లేకుండా సీరియల్ ని తీస్తూ జనాల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారంటూ .మరికొంత మంది అవేశం ప్రదర్శిస్తున్నారు.మరికొందరైతే….కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కి మతి భ్రమించి… ఇలా పరమ చెత్తగా తయారు చేశారని తెగ ఆడిపోసుకుంటున్నారు.బిగ్ బాస్ మాదిరిగానే ఎవరు ఎంత విమర్శించినా … ఈ సీరియల్ కున్న ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు.

ప్రేక్షకులకు కూడా అనటం… చూడటం మామూలైపోయింది.

#Trools #Karthika Deepam #Babu #Vantalakka #Deepa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు