Heroines Roles: తమ పాత్రలతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.ఈ హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలలో తమ పాత్రల ద్వారా చిరాకు తెప్పించారు.

 Negative Comments About Heroines Roles In Movies Rakul Kajal Genelia Rashmika De-TeluguStop.com

ఈ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించగా మరికొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి.అయితే ఈ సినిమాలలోని హీరోయిన్ల పాత్రలు మాత్రం తమకు అస్సలు నచ్చలేదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

కొన్ని పాత్రలు అయితే ఆయా హీరోయిన్ల అభిమానులకు కూడా నచ్చలేదంటే ఆ పాత్రలు ఏ విధంగా ఉన్నాయో సులభంగానే అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటించారనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రష్మిక పాత్ర సినిమాకు మైనస్ అయ్యిందే తప్ప ప్లస్ కాలేదు.

ఈ ఏడాది విడుదలైన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో లైగర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

Telugu Ananya Panday, Genelia, Kajal Aggarwal, Liger, Sita, Tollywood-Movie

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటించగా ఈ సినిమాకు ఆమె మైనస్ అయ్యారు.రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలోని రకుల్ ప్రీత్ సింగ్ చేసే అతి కూడా మామూలుగా ఉండదు.సినిమా సక్సెస్ సాధించినా అమాయకత్వంతో కూడిన అతితో రకుల్ చేసిన ఈ పాత్ర ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.

Telugu Ananya Panday, Genelia, Kajal Aggarwal, Liger, Sita, Tollywood-Movie

ఆరెంజ్ సినిమాలోని జెనీలియా పాత్ర కూడా ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తుంది.ఆరెంజ్ సినిమా ఫ్లాప్ కావడానికి జెనీలియా పాత్ర కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే.సీత మూవీలో కాజల్ యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది.అయితే ఈ సినిమాల విషయంలో పాత్రల విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube