బాలయ్య భగవంత్ కేసరి మూవీపై విష ప్రచారం.. రాజకీయ కక్షతో ఇంతలా టార్గెట్ చేయాలా?

బాలయ్య భగవంత్ కేసరి( bhagavanth kesari ) సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తోంది.ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధించగా ఈ సినిమాలోని మెసేజ్ సైతం అద్భుతంగా ఉంది.

 Negative Comments About Balakrishna Bhagavanth Kesari Details Here Goes Viral ,-TeluguStop.com

ఇంటర్వెల్ ఫైట్ సీన్ ప్రేక్షకుల నుంచి విజిల్స్ వేయించేలా ఉండటం గమనార్హం.బోయపాటి శ్రీను కంటే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) బాలయ్యను భగవంత్ కేసరి సినిమాలో బాగా చూపించారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దసరా పండుగ సెలవులు పూర్తయ్యే వరకు బాక్సాఫీస్( box office ) వద్ద భగవంత్ కేసరి సినిమా హవా కొనసాగుతుందని చెప్పవచ్చు.అయితే సోషల్ మీడియా వేదికగా, ప్రముఖ న్యూస్ పేపర్లలో భగవంత్ కేసరికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది.

ఈ సినిమా అదుర్స్ అనేలా కలెక్షన్లను సాధిస్తున్నా ఈ సినిమాకు తారక్, మెగా ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ లభించడం లేదని బుకింగ్స్ దారుణంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ పత్రికల విష ప్రచారమే తప్ప ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.బాలయ్య హ్యాట్రిక్ సాధించడం తట్టుకోలేని కొన్ని పెయిడ్ మీమ్ పేజీలు సైతం భగవంత్ కేసరి కంటే ఇతర సినిమాలు బాగున్నాయని చెబుతున్నారు.బాలయ్యపై ఈ స్థాయిలో విషం కక్కడం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకటి రెండు వెబ్ సైట్లు ఈ సినిమా గురించి మరీ ఘోరంగా రివ్యూలు ఇవ్వడం జరిగింది.

ఈ సినిమా నుంచి శ్రీలీల( Srileela ) డ్యాన్స్ లు, గ్లామర్ షో ఆశించిన వాళ్లపై అనిల్ రావిపూడి సైతం ఫైర్ అయిన సంగతి తెలిసిందే.నెగిటివ్ కామెంట్ల విషయంలో నందమూరి ఫ్యాన్స్ స్పందిస్తూ బ్రో ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.నందమూరి ఫ్యాన్స్ బాలయ్యకు వరుస విజయాలు దక్కడంతో సంతోషిస్తున్నారు.

బాలయ్య రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube