తెలుగు ప్రేక్షకులు అంగీకరించని విధంగా ఉండబోతున్న 'జెర్సీ'.. నాని ఇంతటి సాహసం అవసరమా?  

Negative Climax For Nani Jersey Movie-hero Nani,jersey Movie,negative Climax

యంగ్‌ హీరో నాని ప్రస్తుతం గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్‌ 19వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుతున్న జెర్సీ యూనిట్‌ సభ్యులు త్వరలోనే సినిమా విడుదలకు సిద్దం చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. 1996 నేపథ్యంలో ఈ చిత్రం కొనసాగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు హింట్స్‌ ఇస్తున్నారు. లేటు వయసులో రంజీ జట్టులో ఎంపిక అయిన వ్యక్తి పడ్డ ఇబ్బందులు ఏంటీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ అనే విషయాలను చూపిస్తూ సినిమా సాగుతుందని ముందే క్లారిటీ ఇచ్చారు..

తెలుగు ప్రేక్షకులు అంగీకరించని విధంగా ఉండబోతున్న 'జెర్సీ'.. నాని ఇంతటి సాహసం అవసరమా?-Negative Climax For Nani Jersey Movie

ఇప్పుడు సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం నెగటివ్‌ క్లైమాక్స్‌తో ముగుస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే రమన్‌ లాంబ అనే రంజీ క్రికెటర్‌ జీవిత కథను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన బంగ్లాదేశ్‌తో ఆడుతున్న సమయంలో బంతి తగిలి చనిపోయాడు.

అదే విధంగా ఇందులో హీరో నాని కూడా బంతి తగిలి చనిపోతాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నాని ఇలాంటి పిచ్చి పని చేయడు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.

ఎందుకంటే గతంలో నాని నటించిన ‘భీమిలి కబడ్డి జట్టు’ చిత్రం మంచి టాక్‌ను దక్కించుకుని క్లైమాక్స్‌ నెగటివ్‌గా ఉండటంతో ఫ్లాప్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు నెగటివ్‌ క్లైమాక్స్‌ను అస్సలు అంగీకరించరు అనే విషయం తెల్సిందే.

ఫుల్‌ సంతోషకరంగా సినిమా ముగిస్తేనే ప్రేక్షకులు ఆనందంగా బయటకు వెళ్లి సినిమా గురించి పాజిటివ్‌గా చెప్తారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నెగటివ్‌ క్లైమాక్స్‌తో ముగిసి ఫ్లాప్‌ అయిన విషయం తెల్సిందే. ఒకటి రెండు మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి..

మరి నాని నెగటివ్‌ క్లైమాక్స్‌తో సాహసం చేయబోతున్నాడా అనేది ఏప్రిల్‌ 19న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.