న్యూస్ రౌండప్ ... టాప్20 

1.నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం


 Voter Id Card As Smart, Ap Tdp State Wide Meeting, Pawan Bahiranga Sabha O-TeluguStop.com

నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలం లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

ఇప్పటికే చిరుతపులి దాడి లో రెండు ఆవులు మృతి చెందాయి అని, పులి భయంతో పొలాలకు వెళ్లాలంటేనే వణుకు పుడుతోందని స్థానికులు వాపోతున్నారు.

2.స్మార్ట్ గా ఓటర్ గుర్తింపు కార్డు


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

ఓటర్ గుర్తింపు కార్డు మరింత స్మార్ట్ కాబోతోంది త్వరలోనే ఈ – ఎపిక్ కార్డును అందుబాటులోకి తేవాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

3.మంత్రి పువ్వాడ ఫోన్ కు అసభ్య మెసేజ్ లు


తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫోన్ కు అసభ్య పదజాలంతో సందేశాలు పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.సదరు వ్యక్తి తిరుమలగిరికి చెందిన వెంకట ఆంజనేయులు గా పోలీసులు పేర్కొన్నారు.

4.ఏపీ టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

ఏపీ టిడిపి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది.

5.సంక్రాంతి సెలవులు


రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

6.9న దివిస్ ప్రాంతాల్లో పవన్ బహిరంగ సభ


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్న ప్రాంతంలో ఈ నెల 9వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించడమే కాకుండా, భారీ బహిరంగ సభ లో పాల్గొన బోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

7.ఏపీలో కరోనా


గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో 128 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

8.రామతీర్థం పై సిఐడి విచారణ


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటనపై సిఐడి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

10.తాజ్ మహల్ లో కాషాయ జెండాల కలకలం


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

ఆగ్రా లోని తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో సోమవారం కొంతమంది హిందూ యువకులు కాషాయ జెండాను ఎగరవేశారు.వెంటనే సమీపంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని తాజ్ గంజ్ పోలీసులకు అప్పగించారు.

11.

భారత్ లో కరోనా


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,375 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.బర్డ్ ఫ్లూ కలకలం


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

ఒక వైపు కరోనా వైరస్ లో రకరకాల కొత్త వైరస్ ల ప్రభావం తీవ్రతరం అవుతున్న సమయంలోనే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.ఈ బర్డ్ ఫ్లూ కారణంగా వలస పక్షులు మరణాలు ఎక్కువగా చోటుచేసుకోవడంతో రాజస్థాన్ నుంచి కేరళ వరకు నాలుగు రాష్ట్రాల్లో అధికారులు హై అలెర్ట్  ప్రకటించారు.

13.యూకే లో లాక్ డౌన్


లండన్ లో కొత్త కరుణ స్ట్రెయిన్ వైరస్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు.

14.కోర్టు కెక్కిన రిలయన్స్


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

పంజాబ్ హర్యానాల్లో జియో సంస్థలకు చెందిన టవర్లను సైట్ లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం ఇన్ఫోకామ్ కోర్టుకెక్కింది
.

15.జనవరి 14న కుంభమేళ


ప్రపంచంలోనే అతి పెద్దదైన కుంభమేళ 2021జనవరి 14 న హరిద్వార్ లో ప్రారంభం కాబోతోంది.

16.విగ్రహాల ధ్వంసం


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం లోని పాత సింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలం గా ప్రసిద్ధి గాంచిన వరాహ లక్ష్మీనరసింహ ఆలయానికి వెళ్లే ముఖ ద్వారం పై ఉన్న మూడు విగ్రహాల ( లక్ష్మీ నరసింహ స్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మంతుడు) చేతులు విరిగిపోయి ఉండటం పై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

17.రామతీర్థం ముఖద్వారం వద్ద ఉద్రిక్తత


విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థం ముఖద్వారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ధర్మ యాత్ర చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

18.జెసి దివాకర్ రెడ్డి పై మరో కేసు


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పెద్దపప్పూరు స్టేషన్ లో జేసీ దివాకర్ రెడ్డి పై 353, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

19.పార్లమెంట్ భవనం నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్


దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న కొత్త పార్లమెంటు భవనానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

20.ఈరోజు బంగారం ధరలు


Telugu Jessedivakar, Ap Tdp, Cid Rama Tirtha, Gold, Reliance, Orangeflags, Voter

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,230

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,230

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube