ఈమె లక్ష్యం, పట్టుదల ముందు ఆర్ధిక సమస్యలు అడ్డు నిలవలేక పోయాయి

సాధించాలనే పట్టుదల ఉండాలే కాని నీ ముందు ఎంత పెద్ద కష్టం ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్లగలవు.సాధించాలని సంకల్పించుకుంటే నీ సంకల్పం ముందు కష్టాలు అన్ని కూడా చిన్నవి అయిపోతాయి.

 Neetu Sharma Father Had No Money For Education So This Girl Turned In To Milk M-TeluguStop.com

ఇది ఒక సినిమాలో రచయిత రాసిన డైలాగ్‌.అయితే దీన్ని అక్షర సత్యం అని నిరూపించింది రాజస్థాన్‌కు చెందిన నీతూ.

ఈమె పరిస్థితులను జయించిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతుంది.ఆమె పడ్డ కష్టాల ముందు ప్రస్తుతం నేను పడ్డ కష్టం ఎంతది అని అంతా అనుకునేలా ఆమె ఇబ్బందులు ఎదుర్కొని లక్ష్యం దిశగా దూసుకు పోయింది.

Telugu Neetu Sharma, Rajasthan, Milk Maid-Inspirational Storys

  రాజస్థాన్‌లోని ఒక పల్లెటూరుకు చెందిన నీతూకు చదువు అంటే చాలా ఇష్టం.గ్రామంలో ఉన్న 8వ తరగతి వరకు తండ్రి చదివించాడు.ఆ తర్వాత చదివించేందుకు ఆయన వద్ద ఆర్థిక స్థోమత లేదు.ఇకపై స్కూల్‌కు వెళ్లనక్కర్లేదు.నేను నిన్న చదివించలేను.ఇంట్లోనే ఉండు అంటూ తండ్రి నీతూతో చెప్పాడు.

ఆ మాటల్లో తండ్రి బాధ అర్థం అయ్యింది.ఆ సమయంలో ఆమెకు తండ్రిపై కోపం కలగలేదు.

తండ్రి పడుతున్న బాధను ఆమె అర్థం చేసుకుంది.ఆర్థిక పరిస్థితులు నీతూకు అర్థం అవుతున్నాయి.

ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకున్న కారణంగా నాన్న స్కూల్‌ మానేయమంటూ చెప్పినా కోపం రాలేదు.

నాన్నకు ఇబ్బంది లేకుండా, చదువు విషయంల తనను తాను ఎలా నిలబెట్టుకోవాలా అని నీతూ ఆలోచించడం మొదలు పెట్టింది.

అందుకోసం తనకు వచ్చిన ఐడియా పాల వ్యాపారం.ఎలాంటి పెట్టుబడి లేకుండా ఉదయాన్నే పూర్తి అయ్యే పని కనుక పాల వ్యాపారం చేస్తే బాగుంటుందని నీతూ శర్మ నిర్ణయించుకుంది.

ఉదయం 4 గంటలకే నిద్ర నుండి లేచి ప్రతి రోజు 5 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ పాలు సేకరించడం మరియు అమ్మడం చేసేది.అలా వచ్చిన కొద్ది మొత్తంతో తన చదువు మళ్లీ ప్రారంభం అయ్యింది.

Telugu Neetu Sharma, Rajasthan, Milk Maid-Inspirational Storys

  అలా నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యింది.పది, ప్లస్‌ 2 ఇలా అన్నింట్లో కూడా ఆమె పాస్‌ అయ్యింది.డిగ్రీ జాయిన్‌ అయిన సమయంలో తాను పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఒక సెకండ్‌ హ్యాండ్‌ లూనా కొనుగోలు చేసింది.డిగ్రీ కాలేజ్‌కు వెళ్లే ముందు కూడా పాలు సేకరించి అమ్మడం చేసేది.

ఎంతో మందికి స్థానికంగా ఆదర్శంగా నిలవడంతో పాటు, స్థానికుల మనసును నీతూ గెలుచుకుంది.ఆమె చదువుకోవాలనే లక్ష్యం ముందు ఆర్థిక ఇబ్బందులు చిన్నబోయాయి.

Telugu Neetu Sharma, Rajasthan, Milk Maid-Inspirational Storys

 

ప్రతి ఒక్కరిలో ఏదో ప్రతిభ ఉంటుంది.కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది.దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి.తన తండ్రి చదివించలేని పరిస్థితిలో ఉన్న సమయంలో నీతూ తనకు తానుగా సంపాదించుకుని చదువుకుంది.ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కూడా చేస్తున్న నీతూ అందరు అమ్మాయిలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని వయసుల వారికి కూడా ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.హ్యాట్సాఫ్‌ సిస్టర్‌ నీతూ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube